త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసిన అల్లు అర్జున్  

కొత్త సినిమా స్టార్ట్ చేసిన బన్నీ త్రివిక్రమ్. .

Bunny And Trivikram Movie Launching-mega Hero,movie Launching,telugu Cinema,tollywood,trivikram

  • గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా గురించి జోరుగా టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. ఉగాది తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు బన్నీ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు.

  • త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసిన అల్లు అర్జున్-Bunny And Trivikram Movie Launching

  • అయిన కూడా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఈ నెల 24న స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపించింది.

    అయితే ఊహించని విధంగా శ్రీరామనవమి సందర్భంగా త్రివిక్రమ్, బన్నీ తమ సినిమాకి ప్రారంభంకి కొబ్బరికాయ కొట్టేసారు.

  • తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటు దర్శకనిర్మాతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా మరో సారి మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది.

  • గీతా ఆర్ట్స్ తో పాటు , హారికా హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.