బన్నీ-సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.తాజాగా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

 Bunny And Sukumar Movie Going To Start On May 11-TeluguStop.com

ఇది కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో నడుస్తుంది అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

సత్యరాజ్ ఇందులో బన్నీ తండ్రిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాతో బన్నీ మరో రెండు సినిమాలకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

అందులో సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒకటి.అయితే త్రివిక్రమ్ సినిమా మొదలెట్టడంత్జో ఇది ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని అందరూ భావించారు.

అయితే దానికి విరుద్ధంగా బన్నీ మొదటి సారి రెండు సినిమాలని ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు.ఈ సినిమా లాంచింగ్ ఈ నెల 11 ఉండబోతుంది అని తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.సినిమా ఓపెనింగ్ తర్వాత కాస్టింగ్ ఫైనల్ చేసి సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.అయితే సుకుమార్ హీరో, త్రివిక్రమ్ హీరో లుక్స్ పరంగా ఎప్పుడు ఒకేలా లేరు మరి ఇలాంటి టైంలో రెండు సినిమాలకి అల్లు అర్జున్ రెండు లుక్స్ ఎలా మెయింటేన్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube