అన‌వ‌స‌రంగా అలాంటి కామెంట్లు చేస్తున్న బండి సంజ‌య్‌.. వ్య‌తిరేక‌త వ‌స్తుందా..?

ఈ మ‌ధ్య తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏది మాట్లాడినా అది చివ‌ర‌కు సంచ‌ల‌న‌మే అవుతోంది.ఆయ‌న ముందస్తు వ్యూహంతోనే అలా మాట్లాడుతారా లేక‌పోతే అప్ప‌టిక‌ప్పుడు అలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో తెలియ‌దు గానీ మాట‌ల‌తోనే సంచ‌ల‌నాల‌కు దారి తీస్తున్నారు.

 Bundy Sanjay Who Is Making Such Comments Unnecessarily .. Will The Opposite Come-TeluguStop.com

ఇక‌పోతే ఇప్పుడు కూడా ఆయ‌న చేసిన మాట‌లు పెను దుమారం రేపుతున్నాయి.ఇప్పుడు ఆయ‌న ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

కాగా ఆయ‌న ఈ యాత్ర‌లో భాగంగా అక్క‌డ‌క్క‌డా మీటింగులు పెడుతూ మాట్లాడుతున్నారు.

అయితే నిన్న సంగారెడ్డి స‌భ‌లో మాట్లాడిన బండి సంజ‌య్ ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అధికారం ఇస్తే గ‌న‌క మొదటగా యూపీలో చేసిన‌ట్టు ఇక్క‌డ కూడా జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పారు.అయితే దీని వెన‌క ఓ కార‌ణం కూడా ఉంది.

ప్ర‌స్తుతం మన దేశంలో ఉన్న ముస్లిం రేజర్వేషన్ల వల్ల హిందూ స‌మాజంలోని బడుగు బలహీన వర్గాల‌తో పాటు బీసీ వ‌ర్గాలు బాగా న‌ష్ట‌పోతున్నాయ‌ని, వారికి రాజ్యాంగ బ‌ద్ధంగా రావాల్సిన ఫ‌లాలు అంద‌ర‌కుండా పోతున్నాయ‌ని చెప్పారు.

Telugu Bandi Sanjay, Ts Congresss, Revanth Reddy, Trs, Ts Poltics-Telugu Politic

మ‌న తెలంగాణ‌లో ఓ వర్గం జనాభా అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడం వల్ల ఎక్కువ‌గా హిందూ స‌మాజంలోని బలహీన వర్గాలకు అన్యాయం జ‌రుగుతోంద‌ని, వారికి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అంద‌ట్లేద‌ని వాపోయారు.కాబ‌ట్టి ఆ పెరుగుతున్న జ‌నాభాను నియంత్రించ‌డం కోసం జనాభా నియంత్రణ చట్టం తీసుకువ‌స్తామ‌ని చెప్పారు.అయితే ఇక్క‌డే అస‌లు చ‌క్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి.

ఎందుకంటే జ‌నాభా నియంత్ర‌ణ చ‌ట్టం అనేది యూపీలో చాలా ఎక్కువ జ‌నాభా ఉంది కాబ‌ట్టి అమ‌లుచేస్తే ప‌ర్వాలేదు గానీ ఐదుకోట్లు జ‌నాభా క‌డా లేని తెలంగాణ‌లో ఎందుకో అర్థం కావ‌ట్లేదు.అది తెస్తే హిందూ స‌మాజం కూడా వ్య‌తిరేకించే ఛాన్స్ లేక‌పోలేదు.

మ‌రి ఆయ‌న వ్యాఖ్య‌లు ఏ మేర‌కు రాజ‌కీయ ల‌బ్ధిని చేకూరుస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube