అక్కడ రైతులు కరువుతో ఏం తింటున్నారో తెలిస్తే.. కళ్లకు కన్నీరు ఆగవు, నాయకులపై ఉమ్మేయాలనిపిస్తుంది

రైతే రాజు అంటారు, కాని ఇండియాలో రైతులు పడే కష్టాలు మరెక్కడా కూడా పడరేమో అంటే అతిశయోక్తి కాదు.రైతులు ఇండియాలో కొందరు అత్యంత దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు.

వ్యవసాయం చేయడంతో వారికి లాభాలు రాక కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఇండియాలో ఇంకా ఉన్నాయి అంటూ నమ్మాల్సిందే.ముఖ్యంగా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సంవత్సరానికి కొన్ని వేల మంది రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా, వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

--> కొందరు మాత్రం మొండిగా బతికేస్తున్నారు.వ్యవసాయంతో ఆదాయం రాకపోవడంతో గడ్డి, ఆకులతోనే ఆహారం తయారు చేసుకుని జీవనాన్ని గడిపేస్తున్నారు.ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ ఖండ్‌ అత్యంత కరువు పీడిత ప్రాంతంగా గుర్తించబడినది.ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతం కరువు ప్రాంతం అంటూ కేంద్రం కూడా సానుభూతి చూపుతు వస్తుంది.

కాని ఇప్పటి వరకు అక్కడి రైతుల పరిస్థితులు మాత్రం బాగుపడినది లేదు.రెండు మూడు ఎకరాల భూములు ఉన్న వారు కూడా అక్కడ తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నారు.

కొందరు అత్యంత దయనీయమైన ఫుడ్‌ను తీసుకుంటున్నారు.

ఆ ప్రాంతంలో కొందరు రైతులు ఎండిన ఒక రకమైన గడ్డిని పొడి చేసి, దాంతో రొట్టెలను చేసుకుంటున్నారు.ఇక పచ్చి గడ్డితో చట్నీలా తయారు చేసుకుంటున్నారు.వారు తింటున్న ఆహారం చూస్తుంటే సామాన్యులకు ఎవరికైనా కూడా ప్రభుత్వాలపై అసహ్యం కలుగక మానదు.

తమ ప్రభుత్వాల గొప్పలు చెప్పుకునే నాయకులు కనీసం వారికి తినేందుకు తిండి అయినా ఇవ్వలేక పోతున్నారు.

ఉన్నోడు మరింత ఉన్నోడుగా అవుతుంటే లేనోడు మాత్రం మరింత దరిద్రుడిగా, తినేందుకు తిండి లేకండా అయిపోతుంది.ఇలాంటి పరిస్థితులు మారాలి అంటే ప్రతి ఒక్కరిలో సామాజిక చైతన్యం రావాలి.కాని అది ఎప్పటికి సాధ్యం కాదు అనేది కొందరి అభిప్రాయం.

ఈ బిజీ లైఫ్‌ లో ఇలాంటి చూసినప్పుడు, విన్నప్పుడు అయ్యో అనిపిస్తుంది.ఆ తర్వాత వాటి గురించి మర్చి పోయి మళ్లీ యదావిధిగా బిజీ లైఫ్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube