దసరా కానుకగా ఫోన్ పే లో బంపర్ ఆఫర్స్..!

ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ కొనసాగుతోంది.అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అగ్రగామి ఆన్లైన్ సంస్థలు కూడా ప్రజలను ఆకర్షించే భారీ మొత్తంలో ఆఫర్లను ఇస్తోంది.

 Dasara Offers On Phone Pe , Phone Pe , Phone Pe Offers, Dasara Festival, Festiv-TeluguStop.com

ఇకపోతే తాజాగా డిజిటల్ పేమెంట్స్ అందించే ఫోన్ పే కూడా తాజాగా ఓ ప్రకటన చేసింది.ఫోన్ పే ద్వారా బంగారం కొనుగోలు, ఆన్ లైన్ రీఛార్జిలు అలాగే ఫోన్ పే స్విచ్ ద్వారా జరిపే షాపింగ్ కోసం అనేక ఆఫర్లను తీసుకువచ్చింది.

ఇందుకోసం వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లో, అలాగే ఏవైతే షాపింగ్ చేశారో అక్కడ కూడా 70% వరకు డిస్కౌంట్ అందించే విధంగా ఫోన్ పే ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది.ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.

చాలా రోజుల నుంచి ఫోన్ స్విచ్ ద్వారా అనేక సేవలను ఫోన్ పే తన కస్టమర్ల కోసం సేవలను అందిస్తోంది.

ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో అందుకు తగిన విధంగానే తన యూజర్లకు విశిష్ట ఆఫర్లను అందించబడుతుంది.

ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫోన్ పే తన కస్టమర్ కోసం వివిధ రకాల భారీ ఆఫర్లతో సురక్షితమైన మరియు కాంటాక్ట్ లెస్ షాపింగ్ పేమెంట్ అనుభవాన్ని తీసుకు వచ్చింది.ఇకపోతే ఇప్పటికే భారతదేశం మొత్తం 23 కోట్ల మంది ఉపయోగిస్తున్నారని వారందరి కోసం ఈ ఆఫర్లను తీసుకువచ్చినట్లు ఫోన్ పే అధికారులు తెలిపారు.

ఇందుకోసం ఫోన్ పే ద్వారా బంగారం కొనడం, అలాగే ఫోన్ పే స్విచ్ లోపల ఉండే వాటి ద్వారా కొనుగోలు చేయడం, ఆన్లైన్ రీఛార్జ్ చేసుకోవడం లేకపోతే ఏదైనా పేమెంటు సంబంధించిన లావాదేవీలు పూర్తి చేయడం ద్వారా ఫోన్ పే కస్టమర్ లు ఎన్నో రివార్డులను తెలుసుకోవచ్చు.,

ఇకపోతే 2017లో నే ఫోన్ పే తన కస్టమర్ల కోసం 24 క్యారెట్ల బంగారం సురక్షితంగా తమకు నచ్చిన విధంగా కొనుగోలు చేసే అవకాశాన్ని అందించింది.

అప్పటినుంచి డిజిటల్ సేవలను ముఖ్యంగా ఫోన్ పే అందిస్తోంది.ఇందులో భాగంగానే మ్యూచువల్ ఫండ్స్, బీమా ఉత్పత్తులను ప్రారంభించింది.కరోనా మహమ్మారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీమా ఉత్పత్తులను కూడా ఫోన్ పే అందిస్తోంది.2018 సంవత్సరం నుంచి ఫోన్ తన యూజర్ల కోసం కొత్తగా స్విచ్ అనే వేదికను తీసుకు వచ్చింది.దీని ద్వారా ఫోన్ పే కస్టమర్ లకు డైరెక్టుగా ఓలా, irctc , మైంత్ర, గోఐబిబో, రెడ్ బస్ లాంటి అనేక భాగస్వాములను చేసుకొని ముందుకు దూసుకు వెళుతోంది.ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా 500 ప్రధాన నగరాలలో ఏకంగా 30 లక్షలకు పైగా వ్యాపార దుకాణాలలో ఫోన్ పే తన సేవలను అందిస్తున్నట్లు ఫోన్ పే అధికారులు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube