బంపర్ ఆఫర్: 5 రోజులకే 5 లక్షలు ఆఫర్ చేసున్న కంపెనీ, ఇంతకీ పనేమిటంటే?

ఏంటి! ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు వింటున్నది నిజమే.అయితే ఇది మనదగ్గర కాదు సుమా.

 Bumper Offer The Company That Offered Rs 5 Lakh In 5 Days , Is It Still Working-TeluguStop.com

బ్రిటన్‌లో ఓమ్నీ అనే ఓ కంపెనీ ఉంది.వీరి ఓ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.అయితే ఆ వ్యక్తి.5 రోజుల పాటు కుక్క ఆహారాన్ని తినాల్సి ఉంటుంది.అవును.అలా తింటే గనుక వారు అక్షరాలా £5,000 అంటే మన రూపాయిలాలలో దాదాపు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు.ఈ జాబ్ ఆఫర్ పొందిన వారు చేయాల్సిందిల్లా ఒక్కటే.

కుక్కల కోసం కొత్తగా తయారుచేసిన రకరకాల ఆహారాన్ని తిని రివ్యూ చెప్పాలి.అయితే ఇక్కడ ఒకే ఆహారాన్ని ఇవ్వరు.

రకరకాల కుక్కల ఆహారం రుచి చూసి, ఎలా ఉందో… ఓ రివ్యూ రిపోర్ట్ రాయాలి.

అలా తిన్న ప్రతి ఆహారానికీ వారు ఓ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది.

ఇక ఆ రిపోర్టులో ఏయే విషయాలు చెప్పాలో ఆ కంపెనీనే నిర్ధారిస్తుంది.ఏది పడితే అది చెప్పడానికి వీలు లేదు.

తింటున్నప్పుడు ఎలా అనిపించింది, కడుపులోకి వెళ్లిన తరువాత ఎలా ఫీల్ అయ్యారు, తిన్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎలా వున్నాయి, అలాగే మూత్ర, మల విసర్జన అనేది ఎలా ఉంది అనేవి ఆ రిపోర్టులో వివరించాల్సి ఉంటుంది.ఏంటి! కష్టం అనిపిస్తుందా? మరి ఊరికే ఇచ్చేస్తారు డబ్బులు మరి!.

ఇకపోతే, ఓమ్నీ కంపెనీ అనేది మొక్కల ఆధారిత కుక్కల ఆహారం తయారుచేస్తోంది.చిలకడదుంపలు, పప్పులు, బ్రౌన్ రౌస్, బ్లూబెర్రీస్, బఠాణీలు, గుమ్మడికాయ, క్రాన్ బెర్రీస్ వంటి వాటితో ఆహారం తయారుచేస్తోంది.

ఇక ఈ ఉద్యోగానికి అర్హతలంటూ ప్రత్యేకంగా ఏమీ వారు మెన్షన్ చేయలేదు.దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు… తమకు ఏవైనా అలర్జీలు ఉంటే మాత్రం ముందే చెప్పాల్సి ఉంటుంది.

కుక్కల ఆహారం తినేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఓ అనుమతి పత్రం రాసి ఇవ్వాలి.ఇకపోతే ఈ ఉద్యోగం భారతీయులకోసం కాదు.దీనికి అప్లై చేసుకునే వ్యక్తి బ్రిటన్ వాసి అయివుండాలి.వయసు 18 ఏళ్లు లేదా అంతకుమించి ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube