బంపర్ ఆఫర్: వ్యాక్సిన్ వేయించుకుంటే బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్..?!

దేశంలో కరోనాను అంతం చేయడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే.అయితే చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.

 Bumper Offer: Gold Coins For Frying Vaccine, Refrigerator ..?! Vaccination, Gold-TeluguStop.com

వ్యాక్సిన్ వల్ల తీవ్ర అనారోగ్యపాలై కొందరు మరణించిన ఘటనలు చోటుచేసుకోవడం వల్ల వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు.అందుకోసం ప్రభుత్వాలు కొన్ని షరతులు కూడా పెట్టడంతో ఇక తప్పదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వ్యాక్సిన్ వేసుకునేవారికి అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.అయితే అవి ఇక్కడ కాదు.

అమెరికాలో వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అక్కడి ప్రభుత్వం బీరు ఫ్రీగా ఇస్తోంది.దీంతో యువత ఎక్కువగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్ లతో పాటు ఇతరత్రా వస్తువులు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు.బీహార్ లోని షియోహార్ జిల్లా అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

జులై 15వ తేదీ నాటికి షియోహార్ జిల్లాలో 45 ఏండ్లు నిండిన వారికి 100 శాతం టీకా ఇవ్వాలని తాము నిర్ణయించడం జరిగిందని అధికారులు వెల్లడించారు.అయితే ఈ జిల్లాలో ఉన్న 43 గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలు.

జులై 15వ తేదీ తర్వాత ఈ జిల్లాలో ఎంట్రీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.గత సంవత్సరం భారీ వర్షాలు పడితే భారీగా వరదలు వచ్చాయి.

అంతకంటే ముందే అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించి ఈ ఆఫర్ ప్రకటించామని అన్నారు అధికారులు.వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందన్నారు.

Telugu Bumper, Gold Coins, Refrisgraters, Latest-Latest News - Telugu

అయితే ఈ ఆఫర్ కు ఓ నిబంధన విధించారు.వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వారి పేర్లు ఓ పేపర్ లో రాసి ప్రతి వారం ఐదుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.ఎంపికైన వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్స్, కూలర్లు ఇస్తామని వెల్లడించారు.దీంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి జనాలు ఎగబడుతున్నారు.మొత్తానికి వ్యాక్సిన్ వేయించేందుకు ప్రభుత్వాలు ఇలా చేయడం సరైనపద్దతే అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube