ఐఆర్‌సీటీసీ నుండి బంపర్ ఆఫర్.. కేవలం ఐదు వేలకే కేరళ టూర్..!

కరోనా వైరస్ దెబ్బకు గత ఎనిమిది నెలలు నుంచి ఎవరు బయట విహారయాత్రకు పోవడమే మానేశారు.పూర్తిగా ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టేసింది.

 Irctc Bumper Offer To Passengers,irctc, Bumper Offer, Kerala Tour, Social Media,-TeluguStop.com

దీంతో ఎందరో అలా బయటికి ఎక్కడికైనా వెళ్లి రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటున్నారు.అయితే ఇలాంటి వారికి తాజాగా ఐఆర్‌సీటీసీ శుభవార్త తెలిపింది.

టూర్ ప్యాకేజీ లకు సంబంధించి ఐఆర్‌సీటీసీ ఈ మధ్య కాలంలో వరుసగా టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తూ వస్తుంది.ఇందులో భాగంగానే కొత్తగా కేరళ రాష్ట్రానికి చెందిన టూరిజం బిజినెస్ ను ఆపరేట్ చేస్తున్న ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీని విడుదల చేసింది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

కేవలం 5000 రూపాయల నుంచి ఈ కొత్త టూర్ ప్యాకేజీలు మొదలు కాబోతున్నాయి.

ఇందులో భాగంగానే జాయ్ ఫుల్ కేరళ అనే పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ సంస్థ.ఈ ప్యాకేజీలో భాగంగా మొత్తం మూడు రోజులు, 2 రాత్రులు గడపవచ్చు.

ఈ ప్యాకేజీ సంబంధించి మొదటగా కొచ్చిన్ లో ఈ టూర్ మొదలు కాబోతోంది.కొచ్చిన్, మున్నార్ ప్రాంతాలలో ఈ టూర్ ప్యాకేజ్ కొనసాగుతుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఈ ప్యాకేజీ సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మొదటిరోజు పర్యాటకులను ఎర్నాకులం రైల్వే స్టేషన్ లేదా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు వారిని పిక్ అప్ చేసుకొని వారిని కొచ్చిన్ వరకు చేరవేస్తారు.పర్యాటకులు మొదటి రోజు ఉదయమే కొచ్చిన్ చేరుకొని అక్కడ ముందుగా సైట్ సీన్ మొత్తం కవర్ చేసి ఆ తర్వాత మున్నార్ కు తీసుకువెళ్తారు.అలా ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూ తర్వాతి రోజు ఎర్నాకులం తీసుకువెళ్తారు.

అక్కడ బోటు రైడింగ్ కూడా వెళ్ళవచ్చు.ఆ తర్వాత రోజు కొచ్చిన్ నగరానికి చేరుకొని అక్కడ రాత్రి బస చేసిన తర్వాత మూడో రోజు కొచ్చిన్ టూర్ ఉంటుంది.

ఇలా కొచ్చిన్ టూర్ ముగిసిన తర్వాత ఆ సాయంత్రం మళ్లీ ఎర్నాకులం రైల్వే స్టేషన్ లేదా కొచ్చిన్ ఎయిర్పోర్టులో ప్రయాణికులను చేరవేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube