ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. వారందరికి ఉచిత రిచార్జ్.. !

కరోనా మనుషులకు గుణపాఠాన్ని నేర్పడానికి వచ్చిందని కొందరు భావిస్తున్నారు కానీ ఈ మహమ్మారి వైరస్ ఎక్కడ లేని కష్టాలను ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారికి రుచి చూపిస్తుంది.ఈ వైరస్ వ్యాప్తి వల్ల జరుగుతున్న నష్టం మాటల్లో చెప్పలేకుండా ఉంది.

 Bumper Offer For Airtel Customers-TeluguStop.com

అసలే మధ్యతరగతి బ్రతుకులు అంతంత మాత్రమే.

ఇక అన్ని రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ వల్ల పేదల బ్రతుకులు ఆకలితో అలమటించే రోజులు వచ్చాయి.

 Bumper Offer For Airtel Customers-ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. వారందరికి ఉచిత రిచార్జ్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొందరికైతే పిడికెడు అన్నం కూడా కరువై పోయింది.ఇలాంటి సమయంలో ఎవరికి తోచిన విధంగా వారు సహయం చేస్తున్నా అవి పేదల వరకు చేరడం లేదన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగా 49 రూపాయల ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది.కాగా చాలా మంది మొబైల్‌ వినియోగదారులు సెకండ్‌ వేవ్‌ కారణంగా తమ ప్లాన్లను రీచార్జి చేయించుకోలేకపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఈ కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు.అంతే కాకుండా రూ.79 రీచార్జ్‌ కూపన్‌ కొనుగోలు చేసిన వారికి కూడా ప్రస్తుతం రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి కంపెనీ వెల్లడించింది.

#COVID-19 #Second Wave #Bumper Offer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు