బంపర్ ఆఫర్: మాస్క్ తయారు చేయండి.. రూ. 3 కోట్లు సొంతం చేసుకోండి..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది.అమెరికా వంటి చలి దేశాల్లో రోజుకి వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

 Bumper Offer Design Convenient Mask And Get Prize Of 3 Crores-TeluguStop.com

వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో.ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం అత్యవసరం అయ్యింది.

అయితే ఎక్కువ సేపు మాస్కులు ధరించడం వలన చాలామంది ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు.కొందరికి సరిగా ఊపిరాడక మాస్క్ లను ధరించడం మానేస్తున్నారు.

 Bumper Offer Design Convenient Mask And Get Prize Of 3 Crores-బంపర్ ఆఫర్: మాస్క్ తయారు చేయండి.. రూ. 3 కోట్లు సొంతం చేసుకోండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాస్కో పెట్టుకొని శ్వాస బయటికి వదులుతున్నప్పుడు అది ఆవిరి రూపంలో కళ్ళజోడు లోకి వెళుతుంది.దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ మాస్కుల వల్ల ఇబ్బంది పడుతున్నారు.

ముఖ్యంగా చలి దేశాల్లో మాస్కులు ధరించడం చాలా అసౌకర్యంగా మారడంతో నో మాస్క్ అనే ఉద్యమాన్ని కూడా కొందరు ప్రారంభించారు.

అయితే మాస్కు పెట్టుకోకపోతే తగిన మూల్యం తప్పదని కేంద్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

దీనితో అసౌకర్యం కలిగించే మాస్కులకు చెక్ పెట్టి సరికొత్త ఆలోచనలతో సౌకర్యవంతమైన మాస్కులు తయారు చేస్తే ప్రజలకు ఇబ్బంది తప్పుతుందనే ఒక ఆలోచన మాస్క్ ఇన్నోవేషన్ చాలెంజ్ సంస్థ అధికారులకు వచ్చింది.దీంతో ఎవరైతే అత్యంత సృజనాత్మకతతో ఒక మంచి మాస్క్ డిజైన్ తయారు చేస్తారో వారికి కోట్లలో డబ్బులు ప్రకటిస్తామని ఆ సంస్థ అధికారులు ప్రకటించారు.

ఇన్నోవేషన్ చాలెంజ్ సంస్థ.బయో మెడికల్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీతో కలసి ఈ మాస్క్ పోటీ నిర్వహిస్తోంది.

Telugu 3 Crores, 3 Crores Prize Money, Corona Virus, Covid-19, Design Convenient Mask, Innovation Challenge Organization, Mask Challenge, Mask Innovation Challenge, Niosh, Prise Money, Viral Latest, Viral News-Latest News - Telugu

ఎవరైతే పూర్తిగా సరికొత్త టెక్నాలజీతో సరికొత్త ఉత్పత్తులతో మంచి మాస్కులు డిజైన్ చేస్తారో వారిలో మొదటి 10 మందికి 10 వేల డాలర్లు ప్రకటించారు.రెండో దశకు చేరుకున్న పోటీదారులు తమ మాస్క్ యొక్క ఉపయోగాల గురించి ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.రెండో దశలో కూడా పాస్ అయిన వారికి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇన్నోవేషన్ చాలెంజ్ సంస్థ సిద్ధ పడింది.అయితే ఈ మాస్కులను పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ధరించగలిగేలాగా తక్కువ ధరలకే అందుబాటులో ఉండేలా డిజైన్ చేయాలి.

#Prise Money #3 Crores #MaskInnovation #Mask Challenge #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు