బంపర్ ఆఫర్: ఆ పండ్ల వ్యర్థాలను ఏం చేయాలో చెప్పేవారికి 7 కోట్లు సొంతమట...!

పండ్ల రసాలు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.ఎందుకంటే అందులో అనేక పోషక పదార్థాలు లభిస్తాయని.

 Bumper Offer 7 Crore Own For Those Who Tell Me What To Do With That Fruit Waste-TeluguStop.com

అయితే ఆ పండ్ల జ్యూస్ తాగిన తర్వాత… ఆ పండ్ల యొక్క తొక్కలు, ఇతర వ్యర్దాలను, అలాగే వారికి సంబంధించిన ఇతర పదార్థాలను పడేయాలి.అలా కాకుండా ఆ పదార్థాలను అట్లాగే ఉంచితే ఇంట్లో కంపు వాసన రావడం ఖాయం.

ఇంట్లో అయితే కొద్దిపాటి జ్యూస్ మాత్రమే కాబట్టి, ఆ తొక్కలను డస్ట్ బిన్ లో వేస్తే సరిపోతుంది.అదే ఫ్యాక్టరీల విషయానికి వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.

వేల టన్నుల జ్యూస్ తయారు చేసే సమయంలో అందుకు సంబంధించిన అనేక పండ్ల వ్యర్థాలు, వాటికి సంబంధించిన తొక్కలు ఎక్కడో చోట పడేయాల్సి వస్తుంది.లేకపోతే ఆ పరిశ్రమలో ఎంతో దుర్వాసన చేరుతుంది.

అయితే ఈ విషయం సంబంధించి ఓ కంపెనీ తాజాగా ఓ ప్రకటన చేసింది.అమెరికా దేశానికి చెందిన ‘ వండర్ ఫుల్’ అనే కంపెనీ వారు తయారుచేస్తున్న దానిమ్మ జ్యూస్ కు సంబంధించి దానిమ్మ వ్యర్థాలను పడేయడానికి అనేక అగచాట్లు పడుతోంది.

ఈ కంపెనీ ప్రతి సంవత్సరం ఏకంగా 50 వేల టన్నుల దానిమ్మ పండ్లను ఉపయోగిస్తోంది.ఇలా 50 వేల టన్నుల దానిమ్మ పండ్ల రసాన్ని తీసిన తర్వాత వాటి వ్యర్థాలను ఏమిచేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు.

అయితే ఈ సమస్యకు సంబంధించి పరిష్కారంగా లాస్ ఏంజిల్స్ లో ఓ వేదిక గా వండర్ఫుల్ ఇన్నోవేషన్ చాలెంజ్ అనే పేరిట సవాల్ విసిరింది.ఈ సవాల్ ఏమిటంటే వారి కంపెనీలో దానిమ్మ వ్యర్ధాలను పడేయకుండా ఏదైనా అవసరం కోసం ఉపయోగించుకునే విధంగా ఆలోచనలను చెబితే అందులో వారికి నచ్చిన ఆలోచన ఇచ్చిన వారికి ఏకంగా ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మని అనౌన్స్ చేసింది.ఇది మన భారతదేశ కరెన్సీలో సుమారుగా 7.3 కోట్ల రూపాయలు.ఇక ఈ ఛాలెంజ్ లో భాగంగా డిసెంబర్ 7వ తేదీని గడువుగా విధించింది.అయితే ఇందులో చిన్న కండిషన్ పెట్టింది.

ఎవరైనా ఆలోచన ఇచ్చేవారు ఖచ్చితంగా పర్యావరణ హితంగా ఉండేలా ఆలోచన ఇవ్వాలని తెలిపింది.మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే వారికి ఇట్టే తెలపండి.

ప్రైజ్ మనీ ని గెలుచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube