టీఆర్ఎస్ పై రేవంత్ మాటల తూటాలు...అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తోంది.కాంగ్రెస్ పార్టీ తాజాగా ఐక్య రాగం వినిపించిన పరిస్థితుల్లో ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా టీఆర్ఎస్ పార్టీపై, కెసీఆర్ పై విమర్శల దాడి పెంచుతున్న పరిస్థితి ఉంది.

 Bullets Of Rewanth Words On Trs   Is This The Real Strategy Telangana Politics,-TeluguStop.com

వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొంత మేర రాజకీయ వేడి తగ్గినా కాంగ్రెస్ మాత్రం ఇంకా ఆ వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.రైతులను టీఆర్ఎస్ పెద్ద ఎత్తున మోసం చేస్తోందని బీజేపీ, టీఆర్ఎస్ తీరుతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయే అవకాశం ఉందని టీఆర్ఎస్ కు రైతులు త్వరలోనే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న పరిస్థితి ఉంది.అయితే వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వపరమైన అంశాలను టార్గెట్ చేస్తూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

Telugu @revanth_anumula, Band Sanjay, Bjp Paert, Central, Formmers, Paddy, Revna

కానీ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేదు కాబట్టి బీజేపీని టార్గెట్ చేసినంతగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ప్రసక్తి ఉండదు.దీంతో కాంగ్రెస్ బలంగా మారడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఉన్నదని మనం చెప్పుకోవచ్చు.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదుర్చుకోబోతున్నదని ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ ఎంత దూకుడుగా ముందుకెళ్తుంది.అంతేకాక క్షేత్ర స్థాయి కార్యకర్తలను ఎంత త్వరగా ఉత్తేజితులను చేస్తుందనే దానిపైనే వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube