అమెరికాలో మళ్ళీ పేలిన తూటా...తాజా సర్వే ఏం చెప్తోందంటే...

Bullet Explodes Again In America What The Latest Survey Is Sayin

అమెరికాలో తుపాకీ సంస్కృతీ నానాటికి పెరిగిపోతోంది.స్కూల్ పిల్లలు దగ్గర నుంచీ దొంగతనాలు చేసే వారి వరకూ ప్రతీ ఒక్కరూ తుపాకులతో విహారం చేయడం అమెరికాలో నిత్యక్రుత్యమే.

 Bullet Explodes Again In America What The Latest Survey Is Sayin-TeluguStop.com

బహిరంగంగా రోడ్డుమీద కూరగాయలు పెట్టి అమ్మేట్టుగా తుపాకులు అమ్మే పరిస్థితులు ఉన్న కారణంగానే అమెరికాలో ఏదో ఒక చోట తుపాకుల పేలుళ్లు రోజూ వినిపిస్తూ ఉంటాయని, అమాయక ప్రజలు అకారణంగా మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితి నుంచీ బయట పడాలంటే తుపాఖీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ఏళ్ళ తరబడిగా స్వచ్చంద సంస్థలు వేడుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.ఇక ప్రభుత్వాలు సైతం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నేరస్తులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని ఫోర్ట్ వ్యాలీ స్టేట్ వర్సిటీలో క్యాంపస్ సమీపంలో తుపాకుల పేలుళ్లు వినిపించాయి.దాంతో వర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిగాయేమోనని ఆందోళన చెందారు విద్యార్ధులు అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.

 Bullet Explodes Again In America What The Latest Survey Is Sayin-అమెరికాలో మళ్ళీ పేలిన తూటా…తాజా సర్వే ఏం చెప్తోందంటే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు మరణించిన వ్యక్తి వర్సిటీకి చెందిన వ్యక్తి కాదని తేల్చి చెప్పారు.గాయపడిన వారు కూడా వర్సిటీకి చెందిన వారు కాదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.దాంతో వర్సిటీ క్యాంపస్ ను మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

ఇదిలాఉంటే అమెరికాలో తుపాకి సంస్కృతి పై ఓ సంస్థ చేపట్టిన సర్వే పలు సంచలన విషయాలు వెల్లడించింది.

గడిచిన ఏడాదికంటే కూడా దాదాపు 30 శాతం తుపాకి దాడులు పెరిగాయని సదరు సర్వే ప్రకటించింది.అమెరికాలో కరోనా మొదలైన నాటి నుంచీ అంటే మార్చి 1 -2020 మొదలు మార్చి 31-2021 వరకూ ఏడాది 13 నెలల కరోనా కాలంలో సుమారు 51 వేల తుపాకి దాడులు జరిగాయట.

అదే గడిచిన ఏడాది 39వేల దాడులు జరిగాయని ఇవన్నీ మానసిక ఒత్తిడులు, కరోనా కష్ట కాలంలో వచ్చిన ఆర్ధిక ఇబ్బందుల కారణంగానమోదు అయ్యాయని సర్వే తెలిపింది.ఈ పరిస్థితులను ముందుగానే ప్రభుత్వం అంచనా వేసి ఉంటే నేరాలు కొంత మేర తగ్గిఉండేవని సర్వే వెల్లడించింది.

#BulletExplodes #Corona #Georgia #America #Gun

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube