అమెరికాలో మళ్ళీ పేలిన తూటా...బిడెన్ పైనే వారి ఆశలు..!!

అమెరికా.అది ఒక అగ్ర దేశం.ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం.అమెరికా!!.

 Bullet Exploded Again In America Their Hopes On Biden-TeluguStop.com

బయటి దేశాల వారు అమెరికాను ఒక పరిపూర్ణ దేశంగా చూస్తారు.ఇక్కడ స్థిరపడాలనే కోరిక చాలామందికి ఉంటుంది.

అమెరికా గురించి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అగ్రదేశం, సంపన్న రాజ్యం, ప్రపంచానికి పెద్దన్న.ఇలాంటి మాటలే వింటుంటాం.

 Bullet Exploded Again In America Their Hopes On Biden-అమెరికాలో మళ్ళీ పేలిన తూటా…బిడెన్ పైనే వారి ఆశలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, కొన్ని రోజులుగా ఇక్కడ పరిస్థితులు తారుమారవుతున్నాయి.ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది.

బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేకుండాపోయింది.అందుకు నిదర్శనం తాజాగా జరిగిన ఈ ఘోరమే.

అమెరికాలో.తుపాకి సంస్కృతికి అడ్డు అదుపు లేకుండా పోయింది.అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయాల్లో కూడా అమెరికాలో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి అంటే.అమెరికాలో గన్ కల్చర్ ఎంతలా పాతుకు పోయిందో తెలుసుకోవచ్చు.

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి.

అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం పైన్‌బ్లఫ్‌ పట్టణంలోని వాట్సన్‌ చాపెల్‌ జూనియర్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై తుపాకీతో కాల్పులు జరిపాడు.ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్న వారంత ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ ఘటనలో .కాల్పులకు గురైన విద్యార్థి (15) తీవ్రంగా గాయపడ్డారు.దీంతో అతడిని హూటహూటిన దగ్గరగా ఉన్న దవాఖానకు తరలించారు.అయినా కూడా ప్రయోజనం లేకుండా పొయింది.చికిత్స పొందుతూ.కాల్పులకు గురైన విద్యార్థి మృతి చెందాడు.

ఈ షాకింగ్ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.ఈ ఘటనలో.

మరో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే, కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థిని జాగిలాలు గుర్తించాయి.నిందితుడిని పోలీసులు జువెనైల్‌ హోంకు తరలించారు.

కానీ, అతడు ఎందుకిలా విచక్షణారహితంగా కాల్పులు చేసాడు అనే గల కారణాలు తెలియరాలేదు.

ఇక.ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని చాలా మంది ప్రముఖులు,చాలా స్వఛ్చంద సంస్ధలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం లేకుండాపోయింది.అంతేకాకుండా.

అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని .అమెరికా నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆఫ్రో-అమెరికన్ అధ్యక్షుడుగా బరాక్‌ ఒబామా, అమెరికా 45 వ అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్.విశ్వ ప్రయత్నాలు చేసినా.ఫలితం మాత్రం శూన్యంగా నే మిగిలింది.

ఫలితంగా.అమెరికా గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారు.

ఇక.నేటి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.అయినా ఈ తుపాకి సంస్కృతికి ముగింపు పలుకుతారు అని అమెరికా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.మరి వాళ్ల ఆశలు నెరవేరుతాయో లేదో తెలియాలి అంటే మరి కొది నెలలు వేచి చూడాల్సిందే.!!

.

#America #WatsonChapel #Joe Biden #Trump #Pinebluff

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు