నదిలో మునిగిపోయిన బుల్డోజర్.. షాకింగ్ వీడియో వైరల్..

ఉత్తరప్రదేశ్‌లోని పానిపట్-ఖతిమా మార్గంలో వందల ఏళ్ల క్రితం నాటి గంగా వంతెనను కూల్చివేస్తుండగా ఒక పెను ప్రమాదం చోటు చేసుకుంది.ఈ కూల్చివేత ప్రక్రియలో, ఒక బుల్డోజర్ ఉన్న ప్రదేశం మొత్తం కొట్టుకుపోయింది.

 Bulldozer Drowned In River Shocking Video Viral ,viral Video, Bulldozer, Bridge-TeluguStop.com

దాంతో ఆ నది నీటిలో మునిగిపోయింది.ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటనలో గంగా కాలువపై ఉన్న వంతెన, బుల్‌డోజర్‌ రెండూ నీటిలో పడిపోగా డ్రైవర్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

 Bulldozer Drowned In River Shocking Video Viral ,Viral Video, Bulldozer, Bridge-TeluguStop.com

ఈ వైరల్ వీడియోలో ఒక బుల్డోజర్ సిమెంటుతో నిర్మించిన వంతెనను కూల్చివేయడం చూడవచ్చు.

ఈ వాహన డ్రైవర్ కేవలం ఒక సెక్షన్‌ వంతెన మాత్రమే కూడా కూల్చేయాల్సి ఉంది.అయితే గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బుల్‌డోజర్ కింద ఉన్న భాగం కూడా నీటిలో కూలిపోయింది.

దాంతో ఇది చూసిన వారంతా కూడా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.ఎగసిపడే అలల మధ్య డ్రైవర్‌ పడిపోవడం చూస్తుండగానే జరిగింది.

ఇంతలోనే బుల్డోజర్ డ్రైవర్‌ను పోలీసులు, చూపరులు ప్రాణాపాయం నుంచి రక్షించారు.వీడియో ముగిసే సమయానికి వాహనం తలకిందులుగా కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు చెబుతున్నారు.అయితే అతని గాయాల తీవ్రత ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.స్థానిక మీడియా ప్రకారం, ప్రస్తుతం పూర్తిగా నీటిలో మునిగిపోయిన పాత వంతెన సుమారు 100 సంవత్సరాల నాటిది.

కాలువ పక్కనే పానిపట్-ఖతిమా హైవేని విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ వంతెనను కూల్చివేశారు.వైరల్ అవుతున్న వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube