వైరల్‌ : ఎద్దు పేడలో బంగారం, అసలేం జరిగిందో తెలిస్తే నవ్వలేక కన్నీళ్లు వస్తాయి

సాదారణంగా ఎద్దు పేడను కొందరు అస్యహించుకుంటారు.కొందరు వ్యవసాయ దారులు ఎద్దు పేడను ఎరువుగా ఉపయోగించుకునేందుకు స్టోర్‌ చేస్తారు.

 Bull Swallows Gold Haryana Family Waits For Animal To Excrete It-TeluguStop.com

కాని ఎద్దులతో సంబంధం లేని వారు, వ్యవసాయం చేయని వారు ఒక ఎద్దును ఇంట్లో కట్టేసుకుని ఎద్దు ఎప్పుడెప్పుడు పేట వేస్తుందా అంటూ ఎదురు చూసిన సంఘటన ఇది.ఆ ఎద్దును ఇంట్లోకి తీసుకు వెళ్లి మరీ కట్టేసి పేడ వేసేందుకు ఎదురు చూడటంకు గల కారణం ఏంటో తెలిస్తే నవ్వు ఆగదు.

Telugu Bull, Bullswallows, Goldmarchant, Gold Merchant, Haryana-

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.హర్యానా సిర్సా జిల్లాలో కలన్‌వాలీ అనే చిన్న పట్టణం ఉంటుంది.ఆ పట్టణంలో రోడ్లపై ఆవులు మరియు ఎద్దులు తిరుగుతూ ఉంటాయి.చెత్త కుప్పల్లో వేసిన చెత్తను తింటూ అవి జీవితాన్ని సాగిస్తూ ఉంటాయి.కలన్‌వాలీలోని 6వ వార్డులో జనక్‌ రాజ్‌ అనే వ్యాపారి నివశిస్తున్నాడు.ఆయన భార్య ఇటీవల ఒక రోజు ఒక ఫంక్షన్‌కు వెళ్లి వచ్చింది.

ఫంక్షన్‌ నుండి తిరిగి వచ్చిన తర్వాత తన ఒంటిపై వేసుకున్న నాలుగు తులాల బంగారాన్ని కిచెన్‌లో ఉన్న కుల్లిపోయిన కూరగాయల్లో వేసింది.ఆ విషయం మర్చి పోయి తెల్లారి ఆ కూరగాయలను చెత్త బుట్టలో పడేసింది.

Telugu Bull, Bullswallows, Goldmarchant, Gold Merchant, Haryana-

  ఆ చెత్త బుట్టను వారి గల్లీలో ఉన్న చెత్త కుండీలో వేశారు.ఆ చెత్తకుండీలోని ఆ కూరగాయలను ఒక ఎద్దు తిన్నది.చెత్త వేసిన తర్వాత కొన్ని గంటలకు ఆమెకు బంగారం విషయం గుర్తుకు వచ్చింది.వెంటనే ఆ చెత్తకుప్ప వద్దకు వెళ్లగా ఆమెకు ఒక ఎద్దు అక్కడ మేస్తున్న విషయం కనిపించింది.

ఆ ఎద్దు నోట్లకి బంగారు ఆభరణాలు పోయాయి.

Telugu Bull, Bullswallows, Goldmarchant, Gold Merchant, Haryana-

 

దాంతో ఆమె తన భర్తతో కలిసి ఆ ఎదును ఇంటికి తీసుకు వచ్చి కట్టేశారు.అది బాగా పేడ వేయాలని దానికి దాన పెట్టడంతో పాటు మోషన్స్‌ అయ్యే మందులు కూడా వేశారు.మొత్తానికి పేడ రూపంలో ఆమె బంగారం బయటకు వచ్చింది.

దాంతో ఊపిరి పీల్చుకుని దాన్ని వదిలేశారు.కాని ఇళ్లంతా కంపు కంపు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube