బుజ్జిగాడుగా వస్తున్న రాజ్ తరుణ్.... ఈసారైనా...

మొదట్లో తన టాలెంట్ తో యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ వెండితెరకి ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయం అయినటువంటి హీరో రాజ్ తరుణ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే కెరీర్ మొదట్లో సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు రాజ్ తరుణ్.

 Bujjigadu Raj Tarun Vijay Kumar-TeluguStop.com

 అయితే ఇటీవల కాలంలో  రాజ్ తరుణ్ నటించినటువంటి లవర్, రాజుగాడు, రంగులరాట్నం, వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో రాజ్ తరుణ్ కొంతమేర గడ్డుకాలం ఎదుర్కుంటున్నాడు.

అయితే తాజాగా రాజ్ తరుణ్  దర్శకుడు విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న”ఒరేయ్ బుజ్జిగా” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.అంతే గాక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ నెల 10వ తారీఖున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

 దీంతో రాజ్ తరుణ్ మరో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు

Telugu Orey Bujjiga, Oreybujjiga-Movie

ఐతే గత కొద్దికాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని స్క్రిప్ట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే రాజు తరుణ్ ఛాంపియన్ అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు చంద్ర పసలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి వివరాలు అధికారికంగా వెలువడినప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube