ఆ ఇంటిపై పగబట్టిన ప్రకృతి.. ఏం జరిగిందంటే?

ఈ కాలంలో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అత్యంత కష్టమైన పనులు.పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా లక్షల రూపాయలు ఖర్చవుతాయి.

 Building Collapsed Due Heavy Rainfall Madhuban Odissa  Building Collapsed, Heavy-TeluguStop.com

అందువల్ల సామాన్య్, మధ్యతరగతి వర్గాలు ఎంతో శ్రమించి అప్పో సొప్పో చేసి ఇల్లు కడుతూ ఉంటాయి.అలా ఎంతో ఇష్టంతో కట్టిన ఇల్లు కూలిపోతే ఆ బాధ వర్ణనాతీతం.

తాజాగా ఒడిశాలో యజమాని కళ్ల ముందే కట్టుకున్న ఇల్లు పేక మేడలా కూలిపోయింది.

గత కొన్ని రోజుల నుంచి ఒడిశాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.అలా కురుస్తున్న వర్షాల వల్ల ఒడిశాలోని మ‌యూర్భంజ్ జిల్లా మ‌ధుబ‌న్‌లో ఒక భవనం యజమాని కళ్ల ముందే నేలకొరిగింది.

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఎవరి ప్రాణాలకూ అపాయం కలగకపోయినా లక్షల రూపాయల భవనం కూలడం కుటుంబ సభ్యులను బాధ పెట్టింది.

కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

యజమాని కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో భవనం హఠాత్తుగా కదలడం ప్రారంభించింది.దీంతో కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ బయటకు రాగా భవనం ఒక్కసారిగా కూలిపోయింది.

అయితే స్థానికులు మాత్రం ఆ భవనంపై ప్రకృతి పగబట్టిందని కామెంట్లు చేస్తున్నారు.ఎందుకంటే ఆ భవనానికి సమీపంలో మరో భవనం ఉండగా సమీపంలో ఉన్న భవనం చిన్న పెచ్చు కూడా ఊడకపోవడం గమనార్హం.