ఫ్రెండ్షిప్ డే నాడు ఆ పదో తరగతి కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు..46లక్షల రూపాయల్ని..

ఫ్రెండ్షిప్ డే వస్తే ఫ్రెండ్ కి ఎలాంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలా అని ఆలోచిస్తాం.ఇంకొందరైతే ఫ్రెండ్స్ కి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటారు.

 Builders Son Distributes Rs 46 Lakh On His Birth Day-TeluguStop.com

కాని ఫ్రెండ్షిప్ డే నాడు ప్రెండ్స్ కి లక్షలు లక్షలు పంచాలని ఏ ఫ్రెండ్ అనుకోడు.కాని ఈ ఫ్రెండ్ అనుకున్నాడు.

మధ్యప్రదేశ్ కి చెందిన పదిహేనేళ్ల కుర్రాడు తన ఫ్రెండ్స్ అందరికి లక్షల రూపాయలు పంచేశాడు.

ఇంట్లో ఉన్న డబ్బులో నుండి 46 లక్షల రూపాయలని పేకముక్కల్లా తన క్లాస్‌మేట్స్‌కి పంచిపెట్టేశాడు జబల్ పూర్ కి చెందిన పదోతరగతి విద్యార్ది.కొందరికి ఖరీదైన గిఫ్ట్‌లు కొనిచ్చాడు.కేవలం క్లాస్మెట్స్ కే కాదు డబ్బు అవసరం ఉందని తెలుసుకున్న తమ ఇంటిముందు అబ్బాయికి అందులో కొంతమొత్తం ఇచ్చేశాడు.

తన ఫ్రెండ్స్లో ఒకడు రోజు వారి కూలి కొడుకు ఆ కుర్రాడికి 15లక్షలు,రోజు తన హోంవర్క్ చేసిపెట్టే వాడికి 3లక్షలు ఇచ్చి తన దానగుణాన్ని చాటుకున్నాడు.ఈ డబ్బు తీసుకున్నవారిలో ఒకడు ఏకంగా ఆ డబ్బు పెట్టి కార్ కొనుక్కున్నాడు.

డబ్బు మాత్రమే కాదు వెండి,బంగారు బ్రాస్లెట్స్,స్మార్ట్ ఫోన్స్ కూడా గిఫ్ట్స్ గా ఇచ్చాడు సదరు అభినవ దానకర్ణుడు.

ఇంతకీ ఆ కుర్రాడికి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసా.ఈ కుర్రాడి తండ్రి వృత్తిరీత్యా బిల్డర్.ఓ ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన రూ.60 లక్షలను తీసుకొచ్చి ఇంట్లో ఓ కప్‌బోర్టులో పెట్టాడు.తర్వాత చూస్తే అందులో రూ.46 లక్షలు మాయమయ్యాయి.దాంతో దొంగతనం జరిగిందేమో అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనపడకపోవడంతో విచారనలో తేలిందేంటంటే డబ్బు పోవడానికి కన్నకొడుకే కారణమని.పోయిన డబ్బు కోసం పోలిసులు వెతుకుతున్నారు.

కొడుకు చేసిన నిర్వాకానికి తండ్రి లభోదిభోమంటున్నాడు.డబ్బు తీసుకున్న వారు మాత్రం కనపడకుండా మాయమయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube