బుగ్గ రామలింగేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా..?

Bugga Ramalingeswara Swamy Temple Tadipatri History Attraction

మనదేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి.ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు.

 Bugga Ramalingeswara Swamy Temple Tadipatri History Attraction-TeluguStop.com

అదేవిధంగా మనదేశంలో ఎన్నో శివ ఆలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకతను చాటుకున్నాయి.ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది బుగ్గ రామలింగేశ్వర ఆలయం.

ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

 Bugga Ramalingeswara Swamy Temple Tadipatri History Attraction-బుగ్గ రామలింగేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు.పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టింపబడినది కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు.

బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు ఎంతో అద్భుతంగా నిర్మించారు.

రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

Telugu Penna Rever, Tadipatri, Tretayugam-Telugu Bhakthi

ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది.బుగ్గ అనగా నీటి ఊట.వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, నీటివనరులు ఎండిపోయిన ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది.ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటంవల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరడు అనే పేరు వచ్చింది.ఇప్పటికీ ఆ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాస బహుళ అష్టమి మొదలుకొని ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వరకు అనగా 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

#Tadipatri #Penna #Tretayugam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube