సర్వర్లు గా అవతారం ఎత్తిన బిల్ గేట్స్,వారెన్ బఫెట్...కారణంఏమిటంటే

ఈ రోజుల్లో ఎవరివారు తమ తమ పనులతో బిజీ గా ఉంటూ పక్కవారిని సైతం ఏమాత్రం పట్టించుకోరు.ఒక్క నిమిషంలో రెండు మూడు వేలు సంపాదిస్తాం అంటే ప్రతి నిమిషం కూడా ఆ డబ్బుల కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు.

 Buffet And Bill Gates Become Servers In Restaurant1-TeluguStop.com

ఈ క్రమంలో ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్కచేయరు.కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వారు.

ఒక్క నిమిషానికి వారి ఆదాయం కొన్ని కోట్లు రూపాయలు ఉంటుంది.అలాంటి వారు అన్నీ పక్కన పెట్టి కాసేపు సర్వర్లుగా మారిపోయారు.

ఇంతకీ ఎవరూ ఆ ఇద్దరూ అని అనుకుంటున్నారా.వారే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్,బర్క్ షైర్ హత్ వె కంపెనీ అధినేత వారెన్ బఫెట్.

ఒక్క క్షణం కూడా తీరిక లేని వీరిద్దరూ కూడా ఒక ఐస్ క్రీమ్ స్టోర్ కి వెళ్లి అక్కడ సర్వర్లు గా మారిపోయారు.

సర్వర్లు గా అవతారం ఎత్తిన బిల�

అక్కడకి వచ్చిన కస్టమర్ల కు ఐస్ క్రీమ్ ని సర్వ్ చేయడమే కాకుండా అక్కడి సర్వర్ల యాప్రాన్ ను ధరించి కొన్ని ఐటమ్స్ కూడా నేర్చుకొని గరిటె తిప్పారు.అంతే ఇక అక్కడి సిబ్బంది ఆనందానికి అవధులే లేవు.బెర్క్ షైర్ హత్ వే వార్షిక సమావేశం కార్యక్రమంలో వారిద్దరూ కలిశారు.

ఈ క్రమంలో ఆ సమావేశం ముగియగానే ఇద్దరూ కలిసి భోజనం చేయాలని అనుకున్నారు.అయితే ఏదైనా బయట హోటల్ లో భోజనం చేయాలని భావించిన వారిద్దరూ కూడా అనుకున్నదే తడవుగా బయట ఒక ఐస్ క్రీమ్ స్టోర్ కి వెళ్లారు.

అక్కడకు వెళ్లి సిబ్బంది యాప్రాన్ ధరించి అక్కడ కస్టమర్స్ కు వడ్డించడమే కాకుండా కుకింగ్ రూమ్ లో కొన్ని ఐటమ్స్ కూడా నేర్చుకోవడానికి గరిటె కూడా తిప్పారు.

దీనికీ సంబంధించిన వీడియో ని బిల్ గేట్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నిజంగా ప్రపంచంలోనే ధనవంతులు అయిన వీరిద్దరూ ఇలా ఒక సాధారణ రెస్టారెంట్ లో సర్వర్లు కింద పనిచేయడం వారి సింపుల్ సిటీ కి నిదర్శనంగా మారింది.గతంలో కూడా బిల్ గేట్స్ ఇలానే సాధారణ వ్యక్తి లా వ్యవహరించి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube