విడ్డూరం: సింహాలను తరిమికొట్టిన బర్రెలు.. వీడియో వైరల్!

ఎక్కడైనా సింహాలు ఇతర జంతువులను వేటాడి చంపి తింటూ ఉంటాయి.క్రూర జంతువు అయిన సింహం ఆకలి వేస్తే ఎదురుగా ఉన్న ఎలాంటి జంతువునైనా వేటాడకుండా వదలదు.

 Her Of Buffaloes Chases Lions Away,buffaloes Hunted, Two Lions, Video Viral, Int-TeluguStop.com

అయితే సింహాన్ని జంతువులు తరమడం ఎప్పుడైనా విన్నామా….? అయితే తాజాగా సాధుజంతువులుగా పేరు పొందిన బర్రెలు సింహాన్ని తరిమాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే రెండు సింహాలు గడ్డి మేస్తున్న కొన్ని బర్రెలను వెంటబడి తరిమాయి.

సింహాలు వెంటబడటంతో భయపడిన గేదెలు పరుగు లంకించుకున్నాయి.అయితే ముందుకు వెళ్లిన కొన్ని గేదెలు మరికొన్ని గేదెలతో కలిసి సింహాల వైపుగా వచ్చాయి.

ఒకేసారి ఎక్కువ సంఖ్యలో గేదెలు తమ వైపుకు రావడంతో సింహాలు సైతం భయపడ్డాయి.గేదెలు ఏం చేస్తాయో అని భయపడి ఘటనా స్థలం నుంచి పారిపోయాయి.

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో, ఎన్ని రోజుల క్రితం జరిగిందో అనే వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు.ఐఎఫ్ఎస్‌ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేశాడు.

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి వేల సంఖ్యలో లైకులు, షేర్ లు వస్తున్నాయి.ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని బర్రెలు నిరూపించాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరికొందరు నెటిజన్లు సింహాలకు చుక్కలు చూపించిన గేదెలు అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube