బద్వేల్ ఫలితం : పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ హవా 

ఏపీ లోని బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది.నేడు ఫలితాలు వెలుబడబోతూ ఉండడం తో అందరిలోనూ ఈ ఫలితాల పై ఆసక్తి నెలకొంది.

 Budvel Begins The By Election Counting Ycp In Lead, Badvel Constency, Badvel Ele-TeluguStop.com

మొదటి నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు అనుకూలంగానే ఫలితాలు ఉంటాయని అందరూ అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే ఫలితాలు వెలువడే బోతున్నాయి అనే అంచనా అందరిలోనూ ఉంది.

ఇక ఈ పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది.ముందుగా పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది .దీంట్లో వైసీపీకి అనుకూలంగానే పోస్టల్ బ్యాలెట్ లో ఫలితాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఎన్నికల ఫలితాలపై వైసిపి ధీమా గానే ఉంది.ఇది తమ సిట్టింగ్ స్థానం కావడం, 2019 ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున గెలిచిన వెంకటసుబ్బయ్య మరణంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి కాబట్టి సానుభూతి వర్కవుట్ అవుతుంది అనే లెక్కల్లో ఉంది.

ఇక్కడ వైసిపి అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధను ఎంపిక చేయగా, టిడిపి, జనసేన పార్టీ లు పోటీకి దూరంగా ఉన్నాయి.బిజెపి మాత్రం తమ అభ్యర్థిగా పనతల సురేష్ ను ఎంపిక చేసింది .మొదటి నుంచి వైసిపి విజయంపైనే అందరి మధ్య చర్చ జరుగుతూ వస్తోంది.ప్రస్తుతం బద్వేల్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
 

Telugu Badvel, Budvel, Budvel Result, Chandrababu, Dasari Sudha, Janasena, Panat

మొత్తం నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు.68.37 శాతం ఓటింగ్ నమోదైంది.వైసీపీ మొదటి నుంచి ఈ నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంతాయి అనే ధీమా లో ఉంటూ  వచ్చాయి.2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య కు 44,734 ఓట్ల మెజార్టీ వచ్చింది.బిజెపి అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.అయితే ఇప్పుడు జనసేన టీడీపీ ల పరోక్ష మద్దతు ఉండడంతో తమకు భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని బిజెపి అంచనా వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube