డియర్‌ కామ్రేడ్‌ బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఎంతో తెలుసా?  

Budget Of Dear Comrade-bharat Kamma,budget,dear Comrade,director,movie Updates,rashmika,vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ చిత్రం వచ్చే నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా సౌత్‌లో ఉన్న ఇతర అన్ని భాషల్లో కూడా విడుదలకు సిద్దం అయ్యింది. ఇటీవలే విడుదలైన టీజర్‌ మరియు పాటలతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది..

డియర్‌ కామ్రేడ్‌ బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఎంతో తెలుసా?-Budget Of Dear Comrade

విజయ్‌ దేవరకొండ గత చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేశాయి. దాంతో ఈ చిత్రంకు కూడా అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ జరుగుతుంది.

భరత్‌ కమ్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ వారు పాతిక కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే సినిమా బిజినెస్‌ చూస్తే దాదాపు 60 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. అన్ని రైట్స్‌కు కలిపి ఏకంగా 60 కోట్ల రూపాయలు నిర్మాతల ఖాతాలో పడే అవకాశం ఉందనే టాక్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

పారితోషికం తీసుకోకుండా విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంకు భాగస్వామ్యం తీసుకున్నాడు. దాంతో సినిమా ద్వారా వచ్చే లాభాల్లో భారీగానే విజయ్‌ దేవరకొండకు లాభం దక్కే అవకాశం కనిపిస్తోంది. అన్ని విధాలుగా ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందనే విశ్వాసం అందరిలో వ్యక్తం అవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 32 నుండి 35 కోట్లకు అమ్ముడు పోయే అవకాశం ఉంది. ఇక ఇతర భాషల్లో డబ్బింగ్‌ రైట్స్‌ ద్వారా మరో 20 కోట్లు రానున్నాయి. శాటిలైట్‌ రైట్స్‌ ఇతర రైట్స్‌ ద్వారా మరో పది నుండి పదిహేను కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి 60 కోట్లకు తగ్గకుండా ఈ చిత్రం బిజినెస్‌ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం యూత్‌లో విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శణం.