బడ్జెట్ 2023-24: సమిష్టి ప్రగతి దిశగా కేంద్ర బడ్జెట్

సమిష్టి ప్రగతి దిశగా కేంద్ర బడ్జెట్ రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రాధాన్యత కల్పించారు.

 Budget 2023-24: Union Budget Towards Collective Progress-TeluguStop.com

ఇందులో భాగంగా 2047 లోగా సికిల్ సెల్ ఎనిమియా అంతంగా అడుగులు వేయనున్నారు.

పీఎం ఆవాస్ యోజనకు రూ.79 కోట్లను బడ్జెట్ లో కేటాయించారని నిర్మలా సీతారామన్ తెలిపారు.క్లీన్ ప్లాంట్ పథకానికి రూ.2 వేల కోట్లు, సహకార సంఘాలకు రూ.2516 కోట్లు, హార్టికల్చర్ కు రూ.2200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేయనున్నారు.

చాయతీ, వార్డు లెవల్ లో పిల్లల కోసం లైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి.అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి పెంచనున్నారు.మహిళా పొదుపు సంఘాలకు అండగా నిలిచామన్న కేంద్ర ఆర్థిక మంత్రి ఫిషరీస్, డెయిరీ సొసైటీలకు అండగా సర్కార్ నిలిచిందన్నారు.

రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఈ సారి బడ్జెట్ లో కల్పించనున్నారు.5.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటుతో పాటు గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు, ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్ల కేటాయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube