బౌద్ధం తీసుకున్నారుగా.... అమరావతి బాధ్యత మీదే....

భారతావని నుంచి బౌద్ధాన్ని స్వీకరించిన జపాన్‌, ఆంధ్రా రాజధాని అమరావతిని తమ టోక్యోలా తీర్చి దిద్దే బాధ్యత జపాన్‌ ప్రభుత్వానిదేనన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు.సోమవారం జపాన్‌ వాణిజ్య మంత్రి టకాగి నేతృత్వంలో 80 మందికి పైగా వివిధ సంస్థల ప్రతినిధుల బృందం చంద్ర బాబుని కల్సిన సంద‌ర్భంలో ఈ వ్యాఖ్యలు చేసారు.

 Buddhism Took On The Responsibility Of Amravati-TeluguStop.com

అస‌లు బౌధ్ధానికి అమరావతి అభివృద్ధికి లింకేంటన్న సంశయాన్ని కూడా తీర్చేసారయన.

జపాన్‌ దేశంలో రెండవ బుద్ధునిగా మన నాగార్జునుడుని పిలుస్తారని, ఆతను జన్మించి, నడయాడిన ఈ నేల‌ నుంచే బౌద్ధం వికసించిందని, అందుకే తమ అభివృద్ధికి శాయశక్తులా సాయం చేయాల‌న్నది మన సిఎం గారి మాటల్లో అంతరార్ధం.

ఇప్పటికే రాజధానిలోని నిర్మాణ భవనాల‌కు జపాన్‌కు చెందిన మాకీ సంస్ధ రూపక‌ల్ప‌న చేస్తున్న విషయాన్ని ఆ బృందానికి తెలియలిజేస్తూ, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన సందర్హంగా ఇలా వ్యాఖ్యలు చేసారు.

అయితే రాజధాని నిర్మాణానికి నాలుగు కాసులివ్వండి మహా ప్రభో! అని డిల్లీ పీఠం ముందు ప్రదక్షణలు చేస్తు, కాళ్ళా, వేళ్ళా, గోళ్ళా పడ్డా కనికరించని వ్యవహారం తెలియజేప్పెందుకే ఇలా సున్నితంగా ఇలా వ్యాఖ్యానించిన‌ట్లు ఓ గుస‌గుస‌…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube