ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని పిలుస్తారు.ఈ వైశాఖ పౌర్ణమిని మహా వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
ఈ వైశాఖ మాసంలో వచ్చే శాఖ నక్షత్రం జ్ఞానానికి సంబంధించినది.ఈ విధమైనటువంటి జ్ఞాన నక్షత్రం రోజున వచ్చే పౌర్ణమిని జ్ఞాన బోధ కలిగిన వారికి ప్రతీకగా భావిస్తారు.
ఈ క్రమంలోనే ఎంతో జ్ఞానాన్ని కలిగిన బుద్ధుడు కూడా ఇదే వైశాఖ పౌర్ణమి రోజు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి కనుక ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
ఈ ఏడాది బుద్ధ పౌర్ణమి 2021 మే 26 బుధవారం వచ్చింది.ఈ పౌర్ణమి 25వ తేదీ రాత్రి 8:20 గంటలకు ప్రారంభమయి.26వ తేదీ మధ్యామ్నం 4:40 గంటల వరకు ఈ పౌర్ణమి గడియలు కొనసాగుతాయి.ఈ బుద్ధ పౌర్ణమి విశిష్టత ఏమిటంటే బుద్ధుడు పుట్టుకతోనే రాజ కుటుంబీకులలో పుట్టినప్పటికీ 28 ఏళ్ల వయసులోనే రాజ్యాన్ని వదిలి మానవ బాధలను సమస్యలను అర్థం చేసుకోవడానికి, తన కుటుంబాన్ని వదిలి వచ్చాడు.బీహార్ రాష్ట్రంలో బోధ గయ వద్ద జ్ఞానోదయం పొందినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

ఈ బుద్ధ పౌర్ణమి భారత దేశమంతటా వివిధ బౌద్ధ ప్రదేశాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ముఖ్యంగా బుద్ధ పౌర్ణమిని బోధ్ గయ మరియు బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ మరియు బుద్ధుడు మరణించిన కుషినగర్ ప్రాంతాలలో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు.సిక్కిం, లడక్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఈ పండుగను ప్రత్యేక ప్రార్థనలు, ఉపన్యాసాలు, మత ప్రవచనాలను బోధిస్తూ, బుద్ధ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహిస్తూ ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.ఈ పండుగ రోజు భక్తులు ఆలయానికి వెళ్లి బుద్ధ విగ్రహాన్ని స్వచ్ఛమైన నీటితో అభిషేకాలు నిర్వహిస్తారు.
అభిషేకం అనంతరం విగ్రహం ముందు పువ్వులు పండ్లు ఉంచి కొవ్వొత్తులు వెలిగిస్తారు.ఈ బుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు డబ్బును విరాళంగా ప్రకటిస్తుంటారు.
ఈ బుద్ధ పౌర్ణమి రోజు భక్తులు తెల్లని దుస్తులు ధరించి ఎటువంటి మాంసాహారాన్ని ముట్టుకోకుండా బుద్ధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
DEVOTIONAL