టీడీపీ నేతల మ‌తిలేని మాట‌లు... అర్ధ స‌త్యాలు..!

రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.మ‌ళ్లీ తామే అధికారంలోకి రావాలి… మ‌ళ్లీ సీఎం సీటు త‌మ‌కే ద‌క్కాలి.

 Buddha Comments On Modi-TeluguStop.com

ఇది ఏపీలో టీడీపీ ప‌రిస్థితి.మ‌రి ఎవ‌రైనా త‌మ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేస్తారు? త‌మ త‌మ స్థాయిలో క‌ష్ట‌ప‌డ‌తారు.కానీ, అధికార టీడీపీ మాత్రం సింప‌తీ వంతెన‌పై ల‌క్ష్యం చేరుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.ఈ నేప‌థ్యంలోనే నాయ‌కులు మ‌తి లేని వ్యాఖ్య‌లు చేస్తున్నారు.గ‌త కొన్నాళ్లుగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీకి అన్యాయం చేసింద‌ని విరుచుకుప‌డుతున్న టీడీపీ నాయ‌కులు.ఇప్పుడు అవ‌కాశం ఉన్న ప్ర‌తి విష‌యంలోనూ త‌మ‌కు సింప‌తీ దొరుకుతుందేమోన‌ని పాకులాడుతున్నారు.

తాజాగా.టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న చేసిన వ్యాఖ్య‌లు మ‌తిలేని వ్యాఖ్య‌లుగానే ప‌రిణ‌మిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నలుగురు ఉన్మాదులు కలసి సీఎం చంద్రబాబు నాయుడుపై భౌతికంగా దాడిచేసేందుకు మహాకుట్ర పన్నుతున్నారని బుద్దా ఆరోపించారు.‘‘2002 సంవత్సరంలో గోద్రా సంఘటనలో ఏకంగా 798 మంది అమాయక ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.నాడు మోడీ కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు.పైపెచ్చు కారు కింద కుక్కపిల్ల పడి చనిపోతే కూడా ఇలానే స్పందిస్తా అని మోదీ ఆనాడు వ్యాఖ్యానించారు.

మోడీ చేష్టలను చంద్రబాబు ఆనాడు ఖండించారు.ఆనాటి సంఘటనను వ్యతిరేకించి, ముస్లింల పక్షాన నిలబడి, వారికి సానుభూతి వ్యక్తం చేసి, మోడీయే ఆ సంఘటనలకు బాధ్యత వహించాలని అన్నందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై కక్షకట్టారు.

మోడీ ఒక నియంత.కుట్ర రాజకీయాలు చేసే ఉన్మాది.

రాష్ట్రంలో జగన్‌ మరో ఉన్మాది.మోడీ, అమిత్‌షా, రామ్‌మాధవ్‌, విజయసాయిరెడ్డి, పీఏపీ చైర్మన్‌ బుగ్గన… వీరందరి కలయికే కుట్రను తేటతెల్లం చేస్తోంది’’ అని అన్నారు, వాస్త‌వానికి చంద్ర‌బాబుపై భౌతిక దాడికి దిగాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంటుంది? ఏకంగా ఓ రాష్ట్ర సీఎంపై భౌతిక దాడి చేయ‌డం అంటే.,.మ‌నం ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామ‌న్న విష‌యాన్ని ఎమ్మెల్సీ మ‌రిచిపోతున్నారు.రాజకీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వ‌నే విష‌యాన్ని కూడా ఎమ్మెల్సీ గుర్తించాలి.రాజ‌కీయాల్లో ఉండేవి కేవ‌లం ఆత్మ‌హత్య‌లే.రంజాన్ సంద‌ర్భంగా టీడీపీకి మైనార్టీలో సింప‌తీ అవ‌స‌ర‌మే.అయితే, ఇలా దిగ‌జారుడు వ్యాఖ్య‌ల ద్వారా సింప‌తీ సాధించాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇక్క‌డే టీడీపీ నేత‌లు బోర్లా ప‌డుతున్నారు.ఇప్ప‌టికైనా వ‌స్త‌వాల‌పై మాట్లాడుకుంటే.ప్ర‌జ‌లు ఒకింత న‌మ్ముతారనే విష‌యాన్ని త‌మ్ముళ్లు గుర్తించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube