బుచ్చియ్య ఎపిసోడ్ : ఇబ్బందుల్లో లోకేష్ ?

తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లి పోయినా, అసంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోయినా, అందరూ ప్రధానంగా విమర్శలు చేసేది టిడిపి యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పైనే.లోకేష్ వ్యవహార శైలి పై ఎప్పటి నుంచో పార్టీ నాయకుల్లో అసంతృప్తి ఉంది.

 Buchiyya Episode: Lokesh In Trouble , Ap Poltics , Tdp , Chandra Babu , Korutla-TeluguStop.com

కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు టిడిపి వీడేందుకు ఇష్టం లేకపోయినా, లోకేష్ వ్యవహార శైలితో పార్టీని వదిలిపెడుతూ.వెళ్తూ వెళ్తూ లోకేష్ పై సంచలన విమర్శలు చేసేవారు.

ఇది ఆయన రాజకీయ ఎదుగుదలకు చాలా ఇబ్బందికరంగా మారుతూ వచ్చింది.లోకేష్ ఇదే విధంగా ఉంటే, టీడీపీ ని కాపాడే వారు ఎవరు ఉండరు అనే వ్యాఖ్యలు వినిపించాయి.

గత కొంత కాలంగా లోకేష్ పార్టీలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ, తనపై ఉన్న అసమర్థ ముద్రను ఆయన చెరిపేసుకున్నారు.

ఇప్పుడిప్పుడే ఒక ట్రాక్ లో లోకేష్ పడినట్లుగా అందరికీ నమ్మకం కలుగుతున్న సమయంలో టిడిపి సీనియర్ నాయకుడు , సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన విమర్శలు చేశారు.తాను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా, తనకు తగిన గౌరవ మర్యాదలు పార్టీలో లభించడం లేదని, కనీసం చంద్రబాబు లోకేష్ సైతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, తనను పక్కన పెట్టారని, తన నియోజకవర్గంలో వేరే వారిని ప్రోత్సహిస్తున్నారని, ఇలా ఎన్నో విమర్శలు చేశారు.

Telugu Ap Poltics, Ap Tdp, Buchiyya, Chandra Babu, Lokesh, Polticalcarrier, Ys J

పార్టీ కోసం తాను ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చినా, చంద్రబాబు పట్టించుకోవడం లేదని ప్రస్తుతం లోకేష్ వ్యవహరిస్తున్న తీరు తనకు బాధ కలిగిస్తోంది అంటూ విమర్శలు చేయడం, పార్టీకి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉండటం తదితర కారణాలతో మళ్లీ లోకేష్ పై అందరి చూపు పడింది.కేవలం యువ నాయకులను ప్రోత్సహిస్తూ, సీనియర్లను పూర్తిగా పక్కన పెడుతున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్లు అయ్యింది.ఇవన్నీ రాబోయే రోజుల్లో లోకేష్ రాజకీయ ఎదుగుదలకు అవరోధంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube