కన్ఫ్యూజన్ లో బుచ్చిబాబు.. ఎందుకో మరి !

సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు తన టాలెంట్ ను మొదటి సినిమాతోనే నిరూపించు కున్నాడు.మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాను బూచి బాబు తెరకెక్కికించిన విషయం తెలిసిందే.

 Buchi Babu Sana Is So Confused, Ntr, Buchi Babu Sana, Uppena, Vaishnav Tej,lates-TeluguStop.com

ఈ సినిమాతో అటు వైష్ణవ్ తేజ్ ఇటు బుచ్చి బాబు ఇద్దరు కూడా తమ టాలెంట్ ను నిరూపించుకుని మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోయింది.

Telugu Buchi Babu Sana, Uppena, Vaishnav Tej-Movie

ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్.ఇప్పటికే బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఒక కథ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఎన్టీఆర్ ఇప్పటికే వరుసగా కమిట్ అయినా సినిమాలు పూర్తి అవ్వాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది.అందుకే బుచ్చి బాబు ఈ లోపు మరొక సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట.

మళ్ళీ వైష్ణవ్ తోనే సినిమా చేయాలనీ అనుకున్నప్పటికీ ఇది కూడా వర్క్ అవుట్ అయ్యేలా లేదు.ఎందుకంటే వైష్ణవ్ ఉప్పెన సినిమా హిట్ తో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు.

కాబట్టి ఆ సినిమా పూర్తి అయ్యేవరకు వైష్ణవ్ కోసం కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి.అందుకే బుచ్చి బాబు తదుపరి సినిమా కోసం మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యింది.

ఉప్పెన సక్సెస్ అయినా వెంటనే బుచ్చి బాబు సినిమా స్టార్ట్ చేసి ఉంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు అంటూ అందరు భావిస్తున్నారు.

Telugu Buchi Babu Sana, Uppena, Vaishnav Tej-Movie

ఈ మధ్యనే బుచ్చిబాబు ఒక యంగ్ హీరోకు కథ చెప్పాడట.ఆయనకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట.

అయితే ఆ యంగ్ హీరో ఎవరో మాత్రం ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు.గురువు లాగానే సూపర్ హిట్ వచ్చిన కూడా ఇంత వరకు సినిమా మొదలు పెట్టలేదని గురువుకు తగ్గ శిష్యుడు అని కొంతమంది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube