చంద్ర‌బాబును కాద‌ని లోకేశ్‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న బుచ్చ‌య్య.. ఆ సీటు కోస‌మేనా..

ఆయ‌న చాలా సీనియ‌ర్ లీడ‌ర్‌.అనాధి కాలం నుంచి టీడీపీని అంటి పెట్టుకుని ఉన్నారు.

 Buchayya Praising Lokesh And Not Chandrababu  For That Seat , Buchayya Choudary-TeluguStop.com

సీనియ‌ర్ ఎన్టీఆర్ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా కూడా ప‌నిచేశారు.ఆయ‌నే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.

కాగా సీనియ‌ర్ ఎన్టీఆర్‌ మ‌ర‌ణం త‌ర్వాత కొన్ని రోజులు ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర్గంలో ఉన్నారు.రాజమండ్రీ నుంచి ఎంపీగా నిల‌బ‌డ్డారు.

కానీ ఓడిపోవ‌డంతో మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చి చంద్ర‌బాబు ప‌క్క‌న చేరారు.కానీ చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఆయ‌న మంత్రి కాలేక‌పోయారు.

కేవ‌లం ఎమ్మెల్యే టికెట్ వ‌ర‌కే చంద్ర‌బాబు ఆయ‌న్ను ప‌రిమితం చేశారు.

ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే.

ఇన్ని రోజులుగా ఆయ‌న మాత్రం టీడీపీని వీడ‌కుండా.అంటి పెట్టుకునే ఉన్నారు.చంద్ర‌బాబు త‌న‌కు మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ఆశ‌లు ఆయ‌న‌లో ఇంకా అలాగే ఉండిపోయాయి.2014లో పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా.ఆయ‌న‌కు ఛాన్స్ రాలేదు.పైగా రాజ‌మండ్రి సిటీ సీటును ఇవ్వ‌కుండా రూర‌ల్ సీటును ఇచ్చారు చంద్ర‌బాబు.ఈ ప్రాంతంలో బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం అయిన ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి చంద్ర‌బాబు పెద్ద పీట వేస్తున్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

దీంతో బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర అంస‌తృప్తిలో ఉన్నారంట‌.ఇక ఆ మ‌ధ్య జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తేనే పార్టీ బాగుప‌డుతుందంటూ బ‌హిరంగ కామెంట్లు కూడా ఇచ్చారు.కానీ చంద్ర‌బాబు ఆయ‌న‌తో మాట్లాడ‌టంతో వెన‌క్కు త‌గ్గారు.

అయితే రాబోయే ఎన్నికల్లో మ‌ళ్లీ త‌న సీటుకు గండం ఉండొద్ద‌ని ఇప్ప‌టి నుంచే లోకేష్ ను ప్రసన్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారంట బుచ్చ‌య్య చౌద‌రి.ఇందులో భాగంగానే లోకేష్ పుట్టిన రోజున ఓ పాట‌ను కూడా రెడీ చేయించారంట‌.

త‌న‌కు మ‌ళ్లీ రాజ‌మండ్రి సిటీ సీటు కావాల‌ని ఆశ ప‌డుతున్నారు.చూడాలి మ‌రి ఆయ‌న ఆశ‌లు నెరవేరుతాయో లేదో.

Buchayya Praising Lokesh And Not Chandrababu For That Seat , Buchayya Choudary , Lokesh , Sr.ntr , Laxmi Parvathi , Chandrababu , Tdp , Adireddy Apparao , Rajamandry - Telugu Adi Apparao, Chandrababu, Laxmi Parvathi, Lokesh, Rajamandry, Sr Ntr

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube