బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సంచలన వ్యాఖ్యలు..!!

బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి( BSP Mayavathi ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే.

 Bsp Party President Mayawati's Sensational Comments, Bsp, Mayawati, Bjp,congress-TeluguStop.com

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నమ్మొద్దని ఉత్తరప్రదేశ్ ప్రజలకు మాయావతి సూచించారు.గురువారం ట్విట్టర్ వేదికగా రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఆమె విరుచుకు పడటం జరిగింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్( Rajasthan ) లో కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే వంటగ్యాస్, వంద యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఇచ్చిన హామీ మోసపూరితమైనదని అభివర్ణించారు.

ఆయా రాష్ట్రాలలో ఈ పార్టీలు ప్రభుత్వాలుగా ఏర్పడి పేద మరియు మధ్యతరగతి ప్రజల ఆకాంక్షల నెరవేర్చటంలో పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు.

వచ్చే ఎన్నికలలో తమ ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు( BRS Party ) మోసపూరిత హామీలతో ప్రజలను కాపాడుకోవడం కోసం ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాయావతి విమర్శించారు.ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాల విషయంలో ప్రజల అపరమ్మత్తంగా ఉండాలని సూచించారు.

గతంలో ఈ పార్టీలు హామీలు ఇచ్చే అధికారంలోకి వస్తే ఆయా రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మాయావతి పేర్కొన్నారు.అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలను విస్మరించి ద్రోహం చేసే పార్టీలకు ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube