పవన్ కళ్యాణ్, మాయా మేనియా లెక్కేంటో తెలిసిపోతుంది  

నేడు జనసేన కోసం మాయావతి ఎన్నికల ప్రచారం. .

Bsp Chief Mayawati Campaign For Janasena In Vijayawada-campaign For Janasena,mayawati,pawan Kalyan,tdp,vijayawada,visakhapatnam,ysrcp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి సిద్ధమై ప్రజల్లోకి వచ్చాడు. ఒక నటుడుగా కంటే ప్రజలకి దగ్గరుండి, సమస్యలపై స్పందించే ఆలోచన ఉన్న వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ చేసిన ఈ సారి మాత్రం తాను కీలకంగా మారాలని, ఏపీ రాజకీయాలు తన చుట్టూ తిరగాలని ఆశ పడుతున్నాడు. అయితే తాను నేరుగా ప్రజా బలంతో అధికారంలోకి రావడం లేదంటే, తాను సెంటర్ పిల్లర్ గా, కింగ్ మేకర్ గా ఉంటూ రెండు పార్టీలని శాశించే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు..

పవన్ కళ్యాణ్, మాయా మేనియా లెక్కేంటో తెలిసిపోతుంది -BSP Chief Mayawati Campaign For Janasena In Vijayawada

ఇక దానికి తగ్గట్లే అతని రాజకీయ లక్ష్యాలు పెట్టుకొని ముందుకి వెళ్తున్నాడు. కోస్తా జిల్లాలతో పాటు, ఉత్తరాంద్రలో, అలాగే అనంతపురం, గుంటూరులో అధికార ప్రతిపక్ష పార్టీలకి బలమైన ప్రత్యర్ధిగా జనసేనాని నిలబడి ఉన్నాడు. ప్రత్యర్ధి పార్టీలు అతని బలం ఎంత తక్కువ చేసే ప్రయత్నం చేసిన ప్రజల్లోకి ఇప్పటికే జనసేన అనే పేరు బలంగా వెళ్ళిపోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకుతో తాము నష్టపోతామని టీడీపీ, వైసీపీ కూడా భావిస్తున్నాయి.

అందుకనే రెండు పార్టీలు జనసేనని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూనే పవన్ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే అనూహ్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ రెండు పార్టీలకి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మాయావతి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న అని చెబుతూ అతని కోసం ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. నేరు విశాఖ, విజయవాడలో మాయావతితో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ఇక మాయావతి ప్రభావం ఇక్కడ ఎస్సీ, ఎస్టీలపై ఎ స్థాయిలో ఉంటుంది అనే విషయం ప్రస్తుతానికి చెప్పలేకపోయిన, అలాగే వారు పవన్ కళ్యాణ్ వెంట ఎంత వరకు నిలబడతారు అనే విషయాలు ఈ రెండు సభలలో మాయావతి ప్రసంగం తర్వాత స్పష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి మాయావతి తన చరిష్మాతో పవన్ కళ్యాణ్ కి ఎంత వరకు ఓటు బ్యాంకు ఇస్తుంది అనేది వేచి చూడాలి.