సంక్రాంతి ఆఫర్.. 5జీబీ డేటా ఫ్రీగా పొందండిలా..

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ టెలికాం కంపెనీలు కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.కొన్ని సంస్థలు ఏకంగా ఉచితంగా డేటా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

 Bsnl Offering 5gb Free Data For Users Porting To Bsnl On The Occasion Of Sankran-TeluguStop.com

ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ 5 జీబీ డేటా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.అయితే ఎవరైతే ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అవుతారో వారికి మాత్రమే 5 జీబీ డేటా అందిస్తామని వెల్లడించింది.

యూజర్లు ఈ డేటాను 30 రోజుల పాటు వాడుకోవచ్చు.లేదా ప్యాక్ వ్యాలిడిటీ అయిపోయేవరకు యూజ్ చేయవచ్చు.

తమ యూజర్ బేస్ పెంచుకోవడానికి ఇలాంటి ఆఫర్లు ఉపయుక్తంగా ఉంటాయని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.

ఈ ఆఫర్ దక్కించుకునేందుకు సంక్రాంతి పండుగ అనగా జనవరి 15 లోపు బీఎస్ఎన్ఎల్ సిమ్ లోకి మారాల్సి ఉంటుంది.

కొద్ది రోజుల క్రితం ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ రేట్లను భారీగా పెంచేశాయి.

దీంతో ఒక్కొక్క యూజర్ పై సుమారు వంద రూపాయల వరకు భారం పడుతోంది.ఈ నేపథ్యంలో చాలా మంది తక్కువ ధరలకే ప్లాన్స్ అందించే నెట్‌వర్క్‌లకు పోర్టు కావాలని యోచిస్తున్నారు.

ఇది గమనించిన బీఎస్ఎన్ఎల్ వారిని మరింత ఆకర్షించేందుకు బ్రహ్మాండమైన ఆఫర్స్ తీసుకొస్తోంది.ఇప్పటికే ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు #SwitchToBSNL పేరుతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Telugu Gb, Airtel, Bsnl Gb, Bumper, Festival, Sankaranthi, Sankranthi Gb, Teleco

ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కి యూజర్లు మారితే వారు 5జీబీ డేటా అదనంగా పొందొచ్చు.అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్‌లో చేరే కొత్త కస్టమర్లు 4జీ సిమ్ ఉచితంగా అందుకోవచ్చు.ఈ ఏడాది మార్చి వరకు ఫ్రీ 4జీ సిమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.కస్టమర్లు తమ ఫోన్ నుంబర్ చేంజ్ చేయకుండానే బీఎస్ఎన్ఎల్‌లో జాయిన్ అవ్వచ్చు.కేవలం రీఛార్జ్ డబ్బుల్ని చెల్లిస్తే సరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube