సిమ్‌ లేకుండానే కాల్స్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ఆప్‌.. వర్కౌట్‌ అయ్యేనా   BSNL New Offer Call Anyone Without SIM Card Now     2018-07-12   03:28:14  IST  Raghu V

గత పది సంవత్సరాలుగా ఇండియాలో టెలికాం విపరీతంగా అభివృద్ది చెందింది. పది సంవత్సరాల క్రితం వరకు సెల్‌ ఫోన్‌ అంటే ఒక లగ్జరీ వస్తువు. ఖరీదైన ఫోన్‌ను కేవలం ఉన్నత శ్రేణివారు మాత్రమే ఉపయోగించేవారు. అయితే పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. భారీ ఎత్తున టెలికాం సంస్థలు రావడంతో ఇన్‌కంమింగ్‌ ఫ్రీ అవ్వడంతో పాటు, అతి తక్కువ రేటుకు ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ కూడా వస్తున్నాయి. ఇక జియో ఎంట్రీ ఇవ్వడంతో టెలికాం రంగంలో సంచలనం నమోదు అయ్యింది. ఈపోటీని తట్టుకునేందుకు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక కొత్త యాప్‌ను తీసుకు వచ్చింది.

బిఎస్‌ఎన్‌ఎల్‌ వారు వింగ్స్‌ పేరుతో తీసుకు వచ్చిన యాప్‌తో సిమ్‌ లేకుండా ఏ నెట్వర్క్‌కు అయినా కాల్స్‌ చేసుకునే వీలు ఉంటుంది. అవతల వ్యక్తులకు నెట్‌ లేకున్నా కూడా కాల్స్‌ వెళ్తాయి. ప్రస్తుతం వాట్సప్‌ మరియు స్కైప్‌ వంటి ద్వారా కాల్స్‌ చేయాలి అంటే అవతలి వ్యక్తి కూడా ఆయా యాప్స్‌ను కలిగి ఉండాలి. కాని వింగ్స్‌ యాప్‌తో చేసే కాల్స్‌కు అవతల వ్యక్తి వింగ్స్‌ యాప్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం అవతలి వ్యక్తి నెంబర్‌ తెలిస్తే చాలు కాల్‌ చేసేయొచ్చు.

అతి త్వరలోనే అందరికి అందుబాటులోకి రాబోతున్న వింగ్స్‌ యాప్‌ సంవత్సర చంద వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్‌ను ఒకసారి రిజిస్ట్రర్‌ చేసుకుని వెయ్యి రూపాయలు చెల్లిస్తే సంవత్సరం అంతా కూడా ఏ నెట్వర్క్‌కు అయినా, ఎంత సమయం అయినా మాట్లాడేసుకోవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకు వచ్చిన ఈ యాప్‌ ప్రస్తుతం టెలికాం సంస్థలకు సవాలు విసురుతోంది.

ప్రస్తుతం జియోతో పాటు పలు టెలికాం సంస్థు కూడా అతి తక్కువ రేటుకు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ వారు తీసుకు వచ్చిన వింగ్స్‌ యాప్‌ను ఎవరు పట్టించుకుంటారు అంటూ కొందరు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. వింగ్‌ యాప్‌ పనిచేయాలి అంటే ఖచ్చితంగా మొబైల్‌ డేటా లేదా వైఫై ఉండాల్సిందే. అదే ఉంటే ఇంకా కాల్స్‌ చేసేందుకు వింగ్స్‌ యాప్‌ ఎందుకు అవసరం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వింగ్స్‌ యాప్‌ సక్సెస్‌ అవ్వక పోవచ్చు అని, వర్కౌట్‌ అయ్యే ఛాన్స్‌ తక్కువగా ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.