అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్థులు ‌...?

ప్రస్తుతం కరోనా వేల మోడీ ప్రభుత్వం అవకాశం చూసుకొని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్కొక్కటిగా ప్రవేటీకరణ చేస్తుంది.ఇందులో భాగంగానే దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ లను ప్రభుత్వ రంగానికి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 Selling Bsnl Properties From Government, Bsnl, Mtnl, India Network Bsnl, Cber, J-TeluguStop.com

ఈ రెండు సంస్థలకు సంబంధించి ఆస్తుల విక్రయానికి కోసం కేంద్రం కొంత మంది కన్సల్టెంట్ ను నియమించింది.ఇదివరకే ఈ విషయాన్నీ ఓ జాతీయ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇక ఈ డీల్ కోసం సీబీఈఆర్‌, జేఎల్‌ ఎల్‌, నైట్ ‌ఫ్రాంక్‌ అనే సంస్థలు ప్రభుత్వానికి కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల చివరి నాటికి కన్సల్టెంట్ సంస్థలు కేంద్రానికి ఓ రిపోర్టును అందజేస్తున్నాయి.అయితే కొన్ని ప్రాథమిక అంచనాల ప్రకారం ఏకంగా రూ.37 వేల కోట్ల పైగా విలువచేసే బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు సంబంధించిన ఆస్తులను అమ్మే విధంగా భారత ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రధానితో జరిగిన ఓ సమావేశంలో టెలికం శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.

Telugu Bsnl, Bsnl Employes, Cber, India Bsnl, Jll Prank, Mtnl-

అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతం కాస్త వేగవంతం చేసిందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఇకపోతే బిఎస్ఎన్ఎల్ కు సంబంధించి కొన్ని వివరాలను కన్సల్టెన్సీ సంస్థలు అడిగాయని వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వబోతున్నట్లు కొందరు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలియజేశారు.ఇకపోతే దీపం సంస్థతో కలిసి టెలికం శాఖ విక్రయం కోసం పని చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube