వేధింపులు తట్టుకోలేక బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య..

ఇతని పేరు గెడాం మారుతి.ఇతడు మేఘాలయలో బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.ఇతనిని ఒక మహిళ ప్రేమిస్తున్నానని.తనని పెళ్ళిచేసుకోవాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తరచు బెదిరిస్తోంది.దీంతో వేధింపులను భరించలేక మారుతి ఆత్మహత్య చేసుకున్నాడు.

 Bsf Jawan Maruthi Suicide In Adilabad District Over Woman Harassment,bsf Jawan,-TeluguStop.com

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌ మండలం బెల్సరీ రాంపూర్‌ గ్రామానికి చెందిన మారుతి (30) అనే యువకుడు బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా మేఘాలయలోని 11వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన ఒక మహిళ తనను వేధిపులకు గురిచేస్తుందని ఆత్మహత్య చేసుకున్నాడు.

మారుతీ ఇటీవలే సెలవులపై తన గ్రామానికి వచ్చాడు.

అతనికి కుటుంబ సభ్యులు పెళ్లి సంభందాలు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో గతంలో అతనికి పరిచయమున్న భర్తను వదిలేసి వచ్చిన పార్వతీ బాయి అనే మహిళ తనని ప్రేమిస్తున్నానని వెల్లడించింది.

అంతేకాదు పెళ్లి కూడా చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది.

Telugu Adilabad, Bsf Jawan, Maruthi-Latest News - Telugu

అయితే ఈ విషయంపై బుధవారం గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిపారు.ఆ పంచాయితీలో పార్వతీ బాయి నేను మారుతిని ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్ళిచేసుకోవాలని చెప్పింది.కానీ మారుతీ నాకు పార్వతీ బాయితో ఎలాంటి సంభందం లేదని తనని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు.

మారుతీ ఇలా చెప్పడంతో పార్వతీ బాబు బంధువులు మారుతీని బెదిరించారు.పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతామని.దీని వల్ల నీ ఉద్యోగం కూడా పోతుందని వార్ణింగ్ ఇచ్చారు.దీంతో మనస్తాపానికి గురైన మారుతి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బయట పడుకుంటానని చెప్పి వచ్చిన మారుతీ తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు మారుతీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ హాస్పిటల్ కు తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube