అనుమతి లేకుండా తండ్రి ఫోటో వాడుకున్నారు అంటూ కోర్టు ను ఆశ్రయించిన బ్రూస్ లీ కుమార్తె

బ్రూస్ లీ గురించి తెలియని వారు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా.చిన్న వయసులోనే తన కుంగ్ ఫూ విద్య లో ఒక గాడ్ లాగా అందరూ కూడా ఆయన్ని కొలుస్తారు.

 Bruce Lee Daughter Sues Fast Food Chain For 30 Million Dollars-TeluguStop.com

ఎంత త్వరగా బ్రూస్ లీ కి గుర్తింపు వచ్చిందో అంతే త్వరగా ఆయన మరణం కూడా సంభవించింది.ఆయన మరణించినప్పటికీ కుంగ్ ఫూ ప్రపంచం లో ఆయనను మరచిపోయేవారు ఎవరూ లేరని చెప్పాలి.

అయితే అలాంటి బ్రూస్ లీ కి వారసులు కూడా ఉన్నారు.కానీ ఎప్పుడూ కూడా వారు పెద్దగా వార్తల్లో నిలిచిన దాఖలాలు లేవు.

అయితే ఇప్పుడు తాజాగా బ్రూస్ లీ కుమార్తె షానన్ లీ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తుంది.చైనా లోని రియల్ కుంగ్ ఫూ అనే ఫుడ్ చైన్ పై షానన్ లీ కేసు పెట్టినట్లు సమాచారం.

తమ కుటుంబసభ్యుల అంగీకారం లేకుండా తన తండ్రి ఫోటో ను వాడుకున్నారు అంటూ ఆమె ఆ సంస్థపై కేసు నమోదు చేసి, నష్టపరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.తన కుటుంబ అనుమతి తీసుకోకుండా తన తండ్రి ఫోటో ను లోగో కింద పెట్టినందునకు నష్టపరిహారంగా 30 మిలియన్ డాలర్లు చెల్లించాలి అంటూ కోర్టును ఆశ్రయించింది.అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.214 కోట్ల రూపాయలు అన్నమాట.అనుమతి లేకుండా తన తండ్రి ఫోటో ను లోగో గా పెట్టుకున్నారని కావున తమకు నష్టపరిహారం ఇప్పించాలి అంటూ కోర్టును కోరారు.మరోపక్క రియల్ కుంగ్ ఫూ కంపెనీ దీనిపై స్పందించింది.

Telugu Bruce Lee, Chinesefast, Bbc, Shannon Lee-

తాము ఈ లోగోను 15 ఏళ్ల నుంచి వాడుతున్నామని.పైగా ఈ లోగోను అధికారులు సైతం అప్రూవ్ చేశారని స్పష్టం చేసింది.చైనా లో ఒక పెద్ద సంస్థగా మారిన రియల్ కుంగ్‌ఫూ అనే కంపెనీని 1990లో స్థాపించగా, ప్రస్తుతం చైనా వ్యాప్తంగా 57 నగరాలకు ఈ సంస్థ విస్తరించి ఉంది.గత 15 ఏళ్లు గా బ్రూస్‌లీ పోలికలతో ఉన్న ఫొటో ను తమ లోగో గా ఆ కంపెనీ వాడుకుంటుంది.

అయితే ఇప్పుడు తాజాగా ఆ కంపెనీ పై బ్రూస్ లీ కుమార్తె కోర్టు లో కేసు వేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube