పాపం కుమార స్వామిని నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( Kcr ) బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేసి రాబోయే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్( Brs ) పార్టీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది.

అయితే పక్క రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.జాతీయ పార్టీ ప్రకటన సమయం లో కర్ణాటక కు చెందిన మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత కుమారస్వామి( Kumaraswamy ) తో కుసీఆర్ సన్నిహితంగా వ్యవహరించారు.

అంతే కాకుండా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి కి మద్దతుగా నిలుస్తాం అన్నట్లుగా పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు.ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత కేసీఆర్ మొహం చాటేశారు.అంతే కాకుండా ఆర్థిక సాయం చేసినందుకు కూడా నిరాకరించారు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కుమారస్వామికి మద్దతుగా నిలుస్తానంటూ గతం లో హామీ ఇచ్చిన కేసీఆర్ నమ్మించి మోసం చేశాడు అంటూ విపక్షాలు కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

Advertisement

జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ని తీసుకు వెళ్లేందుకు కుమారస్వామి వంటి ప్రాంతీయ పార్టీ నాయకుల అవసరం ఎంతైనా ఉంది.అలాంటి నాయకులను అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాస్త మచ్చిక చేసుకొని వారికి మద్దతుగా నిలిస్తే తప్పకుండా భవిష్యత్తు లో మంచి ఉపయోగముండేది.కానీ కేసీఆర్ అంతకు మించి రాజకీయ చతురత ప్రదర్శించి ఉంటాడు.

అందుకే కుమారస్వామి కి మద్దతుగా నిలవకుండా కర్ణాటక( Karnataka ) అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒంటరి పోరాటం చేసేలా చేశాడు.కర్ణాటక అసెంబ్లీ( Assembly ) ఎన్నికల్లో 20 నుండి 25 సీట్లు మాత్రమే కుమార స్వామి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కింగ్ మేకర్ గా కుమార స్వామి నిలిచే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.అదే జరిగితే కాంగ్రెస్ మరియు జెడిఎస్( JDS ) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు