బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం భయం.. ఎందుకంటే..?

దేశ వ్యాప్తంగా సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సొంత రాష్ట్రంలో కొత్త భయం పట్టుకుంది.రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలపైనా సత్తా చాటినా.

 Brs Party Winning Doubts In Khammam,brs,cm Kcr,ponguleti Srinivas,khammam,wyra,c-TeluguStop.com

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చాటలేక పోతోంది.అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది.

వీరికి తోడు కమ్యూనిస్టులు కొంత మేర ప్రభావం చూపనున్నారు.అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు రాబట్టుకున్నా.ఖమ్మంలో మాత్రం చతికిలా పడుతూ వచ్చింది.

2014లోని సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2018 ముందస్తు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటలేక పోయింది.దాంతో సీఎం కేసీఆర్ ఈ జిల్లాల్లో నేతల జంపింగ్ పై ఫోకస్ పెట్టారు.పార్టీలోకి వస్తామన్న అందరి నేతలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి.పార్టీ బలోపేతం చేస్తూ వచ్చారు.అయితే బీఆర్ఎస్ భావిస్తున్నట్టు నేతల్ని మాత్రం లాక్కుంటే ఆక్కడ సరిపోదని సర్వేలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పొత్తు పెట్టుకుని మెజారిటీ స్థానాలను సాధించాయి.

Telugu Ap, Cm Kcr, Congress, Khammam, Telangana, Wyra-Politics

ఆ జిల్లాల్లో ఏపీ కల్చర్ తో పాటు ఏపీలో రాజకీయాలు కూడా ప్రభావం చూసే అవకాశం ఉంది.2018 ముందస్తు ఎన్నికల్లో 10 సీట్లకు గానూ 8 సీట్లు కాంగ్రెస్, టీడీపీలు సాధించాయి.ఒక వైరాలో కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో ఒక ఇండిపెండెంట్ గెలిచారు.

మొత్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.కేవలం ఒక్క సీటు మాత్రమే.

ఈ సారి ఆ మార్కును కనీసం 8 స్థానాలకు పెంచుకోవడానికి పావులు కదుపుతున్నారు.ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచాక నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు గులాబీ కండువా కప్పేశారు.

Telugu Ap, Cm Kcr, Congress, Khammam, Telangana, Wyra-Politics

కాంగ్రెస్ కేడర్ ను అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు పంచుకోవాలని చూస్తున్నాయి.ఈ టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలుకు కాంగ్రెస్ పార్టీలో చేరితే.మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మరో సారి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది.మరి ఎన్నికల నాటికి ఖమ్మం మీద బీఆర్ఎస్ కు పట్టు వస్తుందా.? లేక కాంగ్రెస్ పార్టీ మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయాల్లోకి దూకుతుందా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube