సాగర్ కారులో పడిపోతున్న వరుస వికెట్లు

సూర్యాపేట జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది.గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

పోలింగ్ కు ఇక ఐదు రోజుల గడువే ఉండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.

కాంగ్రెస్ కురువృద్దుడు, మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని మొత్తం రంగరించి తన కుమారుడు కాంగ్రెస్ అభ్యర్ధి జైవీర్ రెడ్డి గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సిద్దం చేయడంతో గులాబీ పార్టీ గూడు చెదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు,కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, జిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్,ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి,పెద్దవూర మండలంలో పేరున్న బీసీ నేత,బీసీ సంఘం జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకట్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు.

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా,పెద్దవూర మండల కేంద్రంలో బొడ్డు వెంకట్ అధ్వర్యంలో 30 కుటుంబాలు కాంగ్రెస్ అభ్యర్ధి జైవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్ధి జైవీర్ రెడ్డిని గెలిపించి,బీఆర్ఎస్ పార్టీకి నిజమైన షాక్ ఇస్తామన్నారు.

Advertisement

రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదని,అందుకే హస్తం పార్టీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు.కాంగ్రెస్ పాలనలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని గిఫ్టుగా ఇస్తామని శపథం చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తేర నరసింహారెడ్డి,జగన్ లాల్ నాయక్,గాలి సైదిరెడ్డి, సాంబయ్య,పులిమాల కృష్ణారావు,చేపూరి వెంకట్ చారి,ఉమామహేశ్వరి,కరమేటి రాజయ్య,వివిధ గ్రామాల నుంచి 25 వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగా, బొడ్డు వెంకట్ అధ్వర్యంలో పెద్దవూర కు చెందిన 30 కుటుంబాలు హస్తం గూటికి చేరారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు కిలారి మురళికృష్ణ యాదవ్,కోటపల్లి రవి గౌడ్,సతీష్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది...ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి...
Advertisement

Latest Suryapet News