తోట చంద్రశేఖర్‌‌పై బీఆర్ఎస్ నేతల్లో అనుమానాలు!

భారత రాష్ట్ర సమితిని విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.ఇందులో భాగంగా మెుదటిసారిగా ఏపీపై పోకస్ పెట్టారు.

తాజాగా తోట చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనే దానిపై ఇప్పటికే కేసీఆర్, తోట చంద్రశేఖర్‌తో మంతనాలు జరిపారు.

బీఆర్ఎస్ ఓటర్లను ఆకర్షించాలంటే ఎలాంటి ప్లాన్స్‌తో ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, ఏపీ అధ్యక్షుడికి వివరించారు.పోలవరం, రాజధాని, కాపు సామాజికి వర్గాన్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ చంద్రశేఖర్‌కు సూచించారు.

ఏపీలో బీజేపీది నామాత్రం ప్రభావమే కనుక ఆ పార్టీ వైపు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.తెలుగుదేశం పార్టీతో జనసేన జట్టు కట్టడంతో పవన్ మద్దతు ఇవ్వడంపై కాపు ఓటర్లు వెనుకడుగు వేస్తున్నారు.

Advertisement

రెడ్డి,బీసీ,ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గం వైసీపీకి మద్దుతుగా ఉండగా, కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపు ఉంది.దీంతో మిగితా వర్గాలను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేసీఆర్. చంద్రశేఖర్‌‌కు తెలిపారు

ఉద్యమాలతో జనాలను ఆకర్షించవచ్చని కావున ఏదైన బలమైన అంశాన్ని ఆసరాగా తీసుకుని పోరాటాలు మొదలు పెట్టలేని చంద్రశేఖర్‌‌కు కేసీఆర్ మార్గనిర్దేశం చేసినట్లుగా సమాచారం.చంద్రశేఖర్ మాజీ జనసేన నాయకుడు కావడంతో పవన్‌‌తో పొత్తు విషయంపై కూడా ఆలోచించాలని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఈ కాపు వర్గానికి సరైనా నాయకత్వం లేకపోవడంతో వారిని ఆకట్టుకోవాలని సూచించారు.

అయితే చంద్రశేఖర్  పార్టీ విస్తరించే విషయంలో ఎంతవరుకు కృషి చేస్తాడనే దానిపై బీఆర్ఎస్ నేతల్లో అనుమానం వ్యక్తమవుతుంది.వ్యక్తి ప్రయోజనాల కోసమే తప్ప పార్టీని విస్తరించే విషయం దృష్టి సారించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే పలు పార్టీలో పని చేసిన చంద్రశేఖర్ ఫెయిల్యూర్ నాయకుడిగా ముద్ర ఉంది.

అలాంటి వాడు పార్టీని ఏం ముందు తీసుకెళుతాడని బీఆర్ఎస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు