KCR : ఎంపీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఇలా డిసైడ్ అయ్యారా ?

తెలంగాణ అసెంబ్లీలో ఎదురైన పరాభం నుంచి ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( BRS Leader KCR ) కోలుకుంటున్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకుని బీఆరఎస్ పై పట్టు నిరూపించుకోవాలనే ప్రయత్నంలో కెసిఆర్ ఉన్నారు.

 Brs Leader Kcr Decision Over Mps Selectionbrs Leader Kcr Decision Over Mps Sele-TeluguStop.com

దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం( Gajwel MLA KCR ) చేసిన కేసీఆర్ ఆ తరువాత పార్టీ ఎమ్మెల్యే,లు సీనియర్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి లోక్ సభ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

కచ్చితంగా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుకునే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించేందుకు కెసిఆర్ సిద్ధమవుతున్నారు.తన పర్యటన ద్వారా పార్టీ నాయకులు మళ్లీ యాక్టివ్ అవుతారని , గెలుపు అవకాశాలు పెరుగుతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టిక్కెట్ల కేటాయింపు విషయంపై కేసీఆర్ పూర్తిగా దృష్టి సారించారు.

Telugu Brs, Lok Sabha, Telangana, Telangana Mps-Politics

మొత్తం తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో( Lok Sabha Constituencies ) పది స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇమేజ్ మరింత పెరుగుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలోని సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టిక్కెట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ వ్యవహాత్మకంగా వ్యవహరించబోతున్నారు .సర్వే నివేదిక ఆధారంగా ఎక్కువ మందిని మార్చాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.పార్లమెంట్ స్థానాల్లో కూడా ముగ్గురు నలుగురు పేర్లతో సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR ) పార్లమెంట్ టు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

దీనిపై కేసీఆర్ కు నివేదిక అందించారు .

Telugu Brs, Lok Sabha, Telangana, Telangana Mps-Politics

పార్టీ అభ్యర్థుల మార్పు చేపట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారట.దీంతో మెజార్టీ స్థానాల్లో కొత్త వారికి అవకాశం దొరికి ఛాన్స్ కనిపిస్తోంది.ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల్లోను కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలనే ఆలోచనతో కెసిఆర్ ఉన్నారు.

ఇప్పటికే బీ ఆర్ ఎస్ కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్ , వద్దిరాజు రవిచంద్ర ,బడుగుల లింగయ్య యాదవ్ లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.వీరిలో సంతోష్ కుమార్( Joginapalli Santosh Kumar ) కెసిఆర్ కు బంధు కావడం తో బంధు ప్రీతి చూపించారని విమర్శలు రాకుండా, జోగినపల్లి సంతోష్ కుమార్ ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇక వద్దిరాజు రవిచంద్ర పారిశ్రామికవేత్త కావడంతో టికెట్ అమ్ముకున్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కెసిఆర్ భావిస్తున్నారు .వీరే కాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ), నిరంజన్ రెడ్డి లాంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారట.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి పేర్లను కేసీఆర్ ఎంపిక చేయరని, ఎస్సీ లేదా బీసీలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి .ఇప్పటికే నాలుగు పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube