ఏపీలో బీఆర్ఎస్  ! బీసీలకే సారథ్యం ? 

ఉద్యమ పార్టీగా మొదలైన టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు .అంతేకాకుండా బీఆర్ఎస్ ను జాతీయ పార్టీలో విలీనం చేస్తూ తీర్మానం పూర్తి చేశారు.

 Brs In Ap! Bc's Leadership , Ap, Bjp, Trs, Brs, Telangana, Kcr, Brs Elections, J-TeluguStop.com

ఇక ఒక్కో రాష్ట్రంలో పట్టు సాధిస్తూ దేశవ్యాప్తంగా కీలకం అయ్యేందుకు,  రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు.  దీనిలో భాగంగానే ఏపీ,  తమిళనాడు, కర్ణాటక , మహారాష్ట్ర తో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు.  అందుకే ఏపీ పై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

 కెసిఆర్ తో పాటు ఆ పార్టీలోని కీలక నాయకులు, మంత్రులకు ఏపీలో బంధు వర్గం ఉండడం, అలాగే ఏపీకి చెందిన చాలామంది కీలక వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం తో సఖ్యతగా మెలుగుతూ ఉండడం , ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలే.

అలాగే టిడిపిలోనే ఉంటూ అసంతృప్తితో ఉన్న నేతలు,  అలాగే మిగిలిన పార్టీలలోనూ అసంతృప్తితో ఉంటూ సరైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారంతా ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.దీంతో ఏపీలో దీంతో ఏపీలో బలపడేందుకు ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

  ఏపీలో రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతాయి అనే విషయాన్ని కెసిఆర్ ఎప్పుడో గుర్తించారు.ముఖ్యంగా రెడ్డి,  కమ్మ సామాజిక వర్గాలే ఇప్పటివరకు పెత్తనం చేస్తుండడంతో , మిగిలిన సామాజిక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.
 

 జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు.కాపు సామాజిక వర్గం మెజారిటీ స్థాయిలో జనసేనకు మద్దతుగా నిలబడుతుండడంతో ఏపీలో మెజార్టీ స్థాయిలో ఉన్న బీసీ సామాజిక వర్గం తమకు సరైన రాజకీయం ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి తో ఉంది .మొదటి నుంచి టిడిపికి బీసీ సామాజిక వర్గం అండదండలు అందించినా,  2019 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడింది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా, మిగతా విషయాల్లో అసంతృప్తితోనే ఉండడంతో బీసీలను తమకు అనుకూలంగా మార్చుకుంటే…  తమకు ఏపీలో తిరిగే ఉండదనే లెక్కల్లో టిఆర్ఎస్ ఉందట.

అందుకే టిఆర్ఎస్ ఏపీలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడంతో పాటు , బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగించాలనే ఆలోచనలు కేసీఆర్ ఉన్నారట.ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన ఓ బిసి కీలక నేత టిఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube