లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఈ మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కోసం ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ( BRS party ) తీవ్ర కసరత్తు చేస్తోంది.
నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న( Peddi Swapna ) పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో పెద్ది దంపతులను ఉద్యమకారులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు సంప్రదిస్తున్నారని సమాచారం.అదేవిధంగా అభ్యర్థిగా ఎర్రోళ్ల శ్రీనివాస్, జోరిక రమేశ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించిన తరువాత బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.