బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ మధ్య కాలంలో బరువును తగ్గించుకునేందుకు, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకునేందుకు ఎందరో మంది బ్రౌన్ రైస్‌నే ఎంచుకుంటున్నారు.
బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ కంటెంట్ తో పాటు కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటే.ఇతర పోషకాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి.
అందుకే వీటి వల్ల ఆరోగ్యానికి బోలెడన్ని బెనిఫిట్స్ అందుతాయి.ఇక హెల్త్‌కు మాత్రమే కాకుండా.
కేశ సంరక్షణలోనూ బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుంది.
చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేయడంలోనూ, హెయిర్ ఫాల్‌ను తగ్గించడంలోనూ, జుట్టు షైనీగా మెరిపించడంలోనూ బ్రౌస్ రైస్ గ్రేట‌్ గా సహాయపడుతుంది.
మరి బ్రౌన్ రైస్‌ను కేశాలకు ఎలా యూజ్ చేయాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్లు బ్రౌన్ రైస్ ఫ్లోర్, ఒక ఎగ్ వైట్, కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.అర గంట తర్వాత కెమికల్స్ తక్కువ గా ఉండే షాంపూ యూజ్ చేసి తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల చిట్లిపోయిన జుట్టు మళ్లీ మామూలుగా మారుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం తగ్గి.
ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.

అలాగే ఒక గిన్నెలో మూడు స్పూన్ల బ్రౌన్ రైస్ ఫ్లోర్, ఒక స్పూన్ ఆవ పిండి, మూడు స్పూన్ల పెరుగు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసి.ఇరవై, ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేసేయాలి.ఇలా నాలుగు రోజులకు ఒక సారి చేస్తే.
చుండ్రు పోతుంది.జుట్టు బలంగా పెరుగుతుంది.
మరియు కేశాలు షైనీగా మారతాయి.