ఆ ఎలుగుబంటి జోస్యమే నిజమైంది.. జో బైడెన్ గెలిచాడు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్‌ గెలుపొందారు.అయితే ఈ విషయాన్ని ముందే సైబీరియా దేశానికి చెందిన ఎలుగుబంటి ఒకటి జోస్యం చెప్పింది.

 Siberian Brown Bear  Favour Joe Biden Over Donald Trump As Us President, Joe Bid-TeluguStop.com

ఎలుగుబంటి జోస్యం ఇప్పుడు నిజమైంది.ఆ ఎలుగుబంటి చెప్పిన విధంగానే బైడెన్ ఘన విజయాన్ని అందుకున్నారు.

అమెరికా దేశానికి చెందిన మొత్తం 290 ఎలక్టోరల్‌ ఓట్లతో జో బైడెన్ అమెరికా దేశపు నూతన అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.దీంతో అమెరికా దేశపు 46 అధ్యక్షుడిగా జో బైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.

అలాగే ఉప అధ్యక్షురాలిగా కమల హారిస్ ఎన్నికయ్యారు.

ఇకపోతే మాజీ అధ్యక్షుడు ట్రంప్ కేవలం 214 ఎలక్ట్రోరల్ ఓట్ల వద్ద ఆగిపోయాడు.

దింతో ట్రంప్ పై జో బైడెన్ విజయం సాధించినట్లు అయ్యింది.అయితే ఇది వరకు 2016 ఎన్నికల సమయంలో కూడా ఈ ఎలుగుబంటి చెప్పినట్లే హిల్లరీ క్లింటన్ పై డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.

ప్రస్తుతం అదే ఎలుగుబంటి ఈసారి ట్రంప్ వైపు వెళ్లకుండా జో బైడెన్ కు ఓటేసింది.ఇందుకు సంబంధించి పుచ్చకాయల పై ఇద్దరు అభ్యర్థుల ఫోటోలు ముద్రుంచి వాటిని ఆ ఎలుగుబంటి వద్ద ఉంచారు.

ఇలా కేవలం ఎలుగుబంటితో మాత్రమే కాకుండా సైబీరియాలోని ఓ జూ లో నివసిస్తున్న రెండు పులులు వద్ద కూడా ఇలానే చేశారు.

ఈ రెండు పులులు అలాగే ఎలుగుబంటి కూడా పూర్తిగా జో బైడెన్ వైపు మొగ్గు చూపాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ జూ లో జరిగిన ఎపిసోడ్ కాస్త బాగా వైరల్ కావడంతో అది కూడా జో బైడెన్ కు బాగా కలిసి వచ్చినట్లు గా పలువురు భావిస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube