48 గంట‌ల్లో 5వేల మొక్క‌లు నాటిన అన్న‌ద‌మ్ములు..

వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు బాగుండాలంటే చెట్లు నాటడం చాలా ముఖ్యం.అయితే చెట్లు నాట‌డంలో కూడా కొంద‌రు ఎంతో ఆస‌క్తి చూపుతూ అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు.

 Brothers Planting Of 5000 Saplings In 48 Hours-TeluguStop.com

ఇప్ప‌టికే ఇలాంటి వారందెరో దేశ ప్ర‌శంస‌లు అందుకున్నారు.ఎందుకంటే మాన‌వాళి మ‌నుగ‌డ సాధ్యం కావాలంటే క‌చ్చితంగా చెట్లు నాటాలి.

అడ‌వులు ఎంత పెరిగితే ప్ర‌కృతి అంత బాగా ఉండి మ‌నుగ‌డ మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది.అయితే ఇలా చెట్లు నాట‌డంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు రికార్డు సృష్టించారు.

 Brothers Planting Of 5000 Saplings In 48 Hours-48 గంట‌ల్లో 5వేల మొక్క‌లు నాటిన అన్న‌ద‌మ్ములు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడులోని విరుదునగర్ లో నివాసం ఉంటున్న సోదరులు ఇలా చేశారు.

కాగా వారిద్ద‌రూ కూడా ఇలా మొక్క‌లు నాటుతూనే 48 గంటల్లో 5,000 మొక్కలు నాటేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారంటే న‌మ్మండి.

ఇక ఇలా వీరు మొక్క‌లు నాటేసి ఏకంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ప్లేస్ ద‌క్కించుకున్నారంటే వారు చేసిన ప‌ని ఎంత‌టి గొప్ప‌దో ఆలోచించండి.ఈ రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లాకు చెందిన‌టువంటి శివకాశి ప్రాంతంలో అరుణ్, శ్రీకాంత్ అనే అన్న‌ద‌మ్ములు ఇద్దరూ ప్ర‌కృతి మీద ఉన్న ప్రేమ‌తో ఈ పనికి పూనుకున్నారు.

ఇక ఇందులో పెద్ద‌వాడైన అరుణ్ చెన్నైలో ఇంజ‌నీర్‌గ‌డా ప‌నిచేస్తున్నారు.

ఇక చిన్న వాడైన శ్రీకాంత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు.

ఇక వీరిద్ద‌రూ కూడా ఈ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో భాగంగా రోజుకు 8 గంటల టైమ్ కేటాయించి 2,500 మొక్క‌లు ఒక్క రోజులో నాటి రెండు రోజుల‌కు 5,000 మొక్క‌లు కంప్లీట్ చేశామ‌ని చెప్పారు.ఇక లాక్‌డౌన్ అప్ప‌టి నుంచే ఇలా మొక్కలు నాటే ప‌నిని చేస్తున్నామ‌ని, ఇది త‌మ జీవితంలో మంచి అలవాటుగా చేసుకున్నామని ఇద్ద‌రూ చెప్పారు.

ఈ విధ‌మైన నేచర్ ఛాలెంజ్ త‌మ‌కు ఎంతో సంతృప్తినిస్తోందంటున్నారు.అంద‌రూ ఇలాగే మొక్క‌లు నాటితే ముందు త‌రాలు బాగుంటాయ‌ని చెబుతున్నారు.

#Brothers #Hours

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు