అన్న అత్యాచారం చేశాడని తల్లికి చెప్తే..ఆమె ఏమి చేసిందంటే     2018-07-23   09:39:56  IST  Bhanu C

తల్లీ తండ్రులు తరువాత అత్యంత గొప్పదైన బంధం అన్నా చెల్లి భంధమే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్నయ్య కామాంధుడుగా మారిపోతే..? అసలు రక్త సంభంధం అనే మాటకి విలువ ఉంటుందా..? టెక్నాలజీ చేతికి అందిన తరువాత వాయి వరసలు మరిచిపోతున్నాడు మనిషి..చేతిలో నెట్ లోకం ఉండటంతో అశ్లీలతకి తావు పెరిగిపోయి మగాళ్ళని మృగాళ్ళుగా మారిపోతున్నారు..చెల్లి పైనే అత్యాచారానికి పాల్పడిన ఒక నీచుడి ఘటన ఇది వివరాలలోకి వెళ్తే..

Brother Raped Sister In Punjab-

Brother Raped Sister In Punjab

పంజాబ్‌లోని ఖరార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది.. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం పంజాబ్ కి వలస వచ్చింది..కుటుంబంతో కలిసి ఉంటున్న పదకొండేళ్ల చిన్నారి మూడవ తరగతి చదువుతోంది…22 ఏళ్ల వయస్సు ఉన్న తన అన్నయ్య తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని తన తల్లికి చెప్పగా షాక్ తిన్న ఆ తల్లి కూతురికి దెయ్యం పట్టిండియా అంటూ తాయత్తు కట్టించింది..

కొడుకే కూతురుని ఇలా చేయడమేంటని తన కూతురిని తిట్టుకుంది.. అయితే, చెల్లెలిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఆ యువకుడు ఏకంగా తన తల్లి కంటబడడంతో అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందనీ..ఎవరితో చెప్పొద్దొని కూతురికి తల్లి సర్ది చెప్పింది.అయితే చిన్నారి ఈ విషయం తన స్నేహితులకి చెప్పడంతో వారు టీచర్స్ కి చెప్పారు దాంతో వారు పోలీసులకి ఫిర్యాదు చేయగా ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసుకు పలు కేసులు ఫోక్సో కేసు కూడా ఫైల్ చేసి కేసుని విచారణ చేస్తున్నారు.