టాలీవుడ్ ఇండస్ట్రీలో బావ బామ్మర్థులు ఎవరంటే ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఓకే కుటుంబానికి చెందిన వారు ఉండటం విశేషం.సినీ ఇండస్ట్రీలో బావ బామ్మర్థులుగా ఉన్న హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 Who Are The Brother In Laws In Tollywood Industry , Tollywood Industry, Brother,-TeluguStop.com

సుధీర్ బాబు, మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు.అల్లు అరవింద్ చెల్లెలు సురేఖను చిరంజీవి వివాహాం చేసుకున్నారు.

నాగార్జున, వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని మొదటి వివాహాం చేసుకున్నారు.ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు.

నాగార్జున, లక్ష్మిల కుమారుడే హీరో నాగ చైతన్య.రామ్ చరణ్, అల్లు అర్జున్ వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.

రామ్ చరణ్ చెల్లెలు శ్రీజను కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్నారు.మెగా ఫ్యామిలీ‌లో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్‌, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ల మధ్య బావ బామ్మర్ధుల సంబంధం ఉంది.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు నారా రోహిత్ వరుసకు బావ అవుతాడు.నాగ చైతన్య, అఖిల్ సోదరులకు సుశాంత్ వరుసకు మేనబావ అవుతాడు.

నాగ చైతన్య, అఖిల్ సోదరులకు సుమంత్ కూడా మేనబావ అవుతాడు.నాగ చైతన్య – రానా దగ్గుబాటి కూడా వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.రామ్ పోతినేని అక్కను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు.వీళ్లిద్దరు వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.

హీరో రిషి సోదరి షాలినిని అజిత్ ప్రేమ వివాహాం చేసుకున్నాడు.దివంగత లెజండరీ సింగర్ ఎస్పీ బాలు చెల్లెలు ఎస్పీ శైలజను శుభలేఖ సుధాకర్ పెళ్లి చేసుకున్నారు.

వీళ్లిద్దరు బావ బామ్మర్థులు అవుతారు.నందమూరి నట సింహం బాలకృష్ణకు దగ్గుబాటి వెంకటేశ్వరావు, చంద్రబాబు నాయుడుకు బామ్మర్ధి అవుతాడు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా.రాజమౌళి మరియు చంద్రశేఖర్ యేలేటి వరుసకు బావ బామ్మర్థులు అవుతారు.సల్మాన్ ఖాన్ చెల్లెలు ఆర్పిత భర్త ఆయుష్ శర్మ కూడా హీరోనే.సంజయ్ దత్, కుమార్ గౌరవ్.సంజయ్ దత్ చెల్లెలు నమ్రత దత్‌ను కుమార్ గౌరవ్ పెళ్లి చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube